🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 222 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. జీవితాన్ని మించిన దైవం లేదు. అస్తిత్వాన్ని మించిన ఆలయం లేదు. నువ్వు ప్రతిదాన్ని ఉత్సవంగా జరుపుకోవడం ఆరంబిస్తే నువ్వు నిజమైన ఆరాధకుడవుతావు. నువ్వు దేన్నీ నమ్మాల్సిన పన్లేదు. నువ్వు ఏం చేసినా అది నీ ధ్యానమవుతుంది.🍀
ప్రతి ఒక్కరు మతానికి సంబంధించి కొత్త విధానాన్ని అవలంబించాలి. మతమన్నది, జీవితాన్ని ఉన్నతంగా ప్రదర్శించేది. జీవితాన్ని అభివృద్ధిపదంలో నడిపేది. జీవితాన్ని మరింత సౌందర్య భరితం చేసేది. అది సృజనాత్మకంగా వుండాలి. పలాయనంగా కాదు. నిన్ను మొద్దుబారేలా చెయ్యకూడదు. మరింత సున్నితంగా మార్చాలి. నా వరకు జీవితాన్ని మించిన దైవం లేదు. అస్తిత్వాన్ని మించిన ఆలయం లేదు.
అప్పుడు ప్రతిదీ దైవత్వం నిండిన ఉత్సవమవుతుంది. అప్పుడు కలయిక ఉత్సవం, విడిపోవడం ఉత్సవం, పసితనం ఉత్సవం, యవ్యవనం ఉత్సవం, వృద్ధాప్యం ఉత్సవం. విభిన్నరకాల ఉత్సవాలు. నువ్వు ప్రతిదాన్ని ఉత్సవంగా జరుపుకోవడం ఆరంబిస్తే నువ్వు నిజమైన ఆరాధకుడవుతావు. నువ్వు దేన్నీ నమ్మాల్సిన పన్లేదు. చర్చికి, ఆలయానికి వెళ్ళాల్సిన పన్లేదు. నువ్వు ఎక్కడ వున్నా, నువ్వు ఏం చేసినా అది నీ ధ్యానమవుతుంది. సాధన అవుతుంది. నీ క్రమశిక్షణ అవుతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments