నిర్మల ధ్యానాలు - ఓషో - 223
- Prasad Bharadwaj
- Aug 10, 2022
- 1 min read

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 223 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రేమను మించి ఏదీ లోతుల్లోకి వెళ్ళలేదు. అది శరీరాన్ని మాత్రమే కాదు, మనసును మాత్రమే కాదు ఆత్మను కూడా ఓదారుస్తుంది. అపుడు వ్యక్తి సమస్తమవుతాడు. నువ్వు స్వచ్ఛమైన చైతన్యంతో వుంటావు. 🍀
ప్రపంచంలో ఓదార్పు నిచ్చే గొప్ప శక్తి ప్రేమ. ప్రేమను మించి ఏదీ లోతుల్లోకి వెళ్ళలేదు. అది శరీరాన్ని మాత్రమే కాదు, మనసును మాత్రమే కాదు ఆత్మను కూడా ఓదారుస్తుంది. వ్యక్తి ప్రేమిస్తే అతని గాయాలన్నీ మాయమవుతాయి. అపుడు వ్యక్తి సమస్తమవుతాడు. సమస్తం కావడమంటే పవిత్రం కావడమే. సమస్త కాని పక్షంలో పవిత్రం కానట్లే. భౌతిక ఆరోగ్యమన్నది పైపైన విషయం దాన్ని వైద్యం ద్వారా బాగుపరచవచ్చు. సైన్సు ద్వారా నిర్వహించవచ్చు.
కానీ లోపలి కేంద్రాన్ని లోపలి ఆరోగ్యాన్ని ప్రేమ ద్వారా మాత్రమే బాగుపరచవచ్చు. ప్రేమ రహస్యం తెలిసిన వాళ్ళకు జీవితంలోని గొప్ప రహస్యం తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకు బాధలుండవు. వాళ్ళకు వృద్ధాప్యం, మరణం వుండదరు. శరీరం ముసలిది అవుతుంది. శరీరం నశిస్తుంది. కాని నువ్వు స్వచ్ఛమైన చైతన్యంతో వుంటావు. నీకు జనన మరణాలు వుండవు. ఆ స్వచ్ఛమైన చైత్యంతో వుండటమంటే స్వచ్ఛమైన వునికితో వున్నట్లే. అప్పుడు దాని ఆనందం ఆవిర్భవిస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments