నిర్మల ధ్యానాలు - ఓషో - 227
- Prasad Bharadwaj
- Aug 18, 2022
- 1 min read

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 227 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనలో మనమేది సృష్టించుకుంటే అది అయస్కాంత క్షేత్రమవుతుంది. వ్యక్తి అస్తితవ్వపు ఆశీర్వాదాన్ని అందుకోదలచుకుంటే తనకు వీలయినంత ఆనందాన్ని సృష్టించాలి. 🍀
నువ్వు అయస్కాంత శక్తిని కలిగి వుంటే దానికి తగిన దానినే ఆకర్షిస్తావు. అది ఒక తాగుబోతు నగరానికి రావడం లాంటిది. వెంటనే అతను నగరంలోని యితర తాగుబోతుల్ని కలుస్తాడు. జూదగాడు నగరానికి వస్తే యితర జూదగాళ్ళని కలుస్తాడు. దొంగ నగరానికి వస్తే యితర దొంగల్తో స్నేహం చేస్తాడు. ఒక సత్యాన్వేషి నగరానికి వస్తే యితర సత్యాన్వేషకుల్ని కనిపెడతాడు. మనలో మనమేది సృష్టించుకుంటే అది అయస్కాంత క్షేత్రమవుతుంది. అది ఒక శక్తి కేంద్రాన్ని ఏర్పరుస్తుంది. అక్కడి నించీ పనులు జరగడం ఆరంభిస్తాయి.
కాబట్టి వ్యక్తి అస్తితవ్వపు ఆశీర్వాదాన్ని అందుకో దలచుకుంటే తనకు వీలయినంత ఆనందాన్ని సృష్టించాలి. నీ దగ్గర మరింత వుంటే అది మరింతగా వస్తుంది. ఒకసారి ఈ రహస్యాన్ని వ్యక్తి అర్థం చేసుకుంటే లోపలి ప్రపంచంలో అతను మరింత మరింత సంపన్నుడవుతాడు. అతని ఆనందంలో అంతులేని గాఢత పెరుగుతుంది. పరవశానికి అక్కడ అంతు వుండదు. వ్యక్తి సరైన మార్గంలో అడుగుపెట్టడ మొక్కటే జరగాలి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios