🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 230 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. వ్యక్తి ఏమి చేసినా, వంట చేసినా, బట్టలుతికినా, తోటపని చేసినా, అదంతా ప్రార్థనలో భాగమే. అదంతా ధ్యానమే. అదంతా ఉత్సవమే. జీవితాన్ని నువ్వెంత ఆహ్లాదంగా తీసుకుంటే నువ్వంత కాంతితో నిండుతావు. 🍀
మతమన్నది ఒక ప్రత్యేక చర్యగా వుండకూడదరు. అది జీవితం నించీ వేరయినదిగా వుండకూడదు. అది జీవితం నించీ వచ్చింది కావాలి. వ్యక్తి ఏమి చేసినా, వంట చేసినా, బట్టలుతికినా, తోటపని చేసినా, అదంతా ప్రార్థనలో భాగమే. అదంతా ధ్యానమే. అదంతా ఉత్సవమే. మతమన్నది జీవితానికి వేరయితే అది పలాయనవాదాన్ని సృష్టిస్తుంది.
జీవితమన్నది మతమయితే అది సృజనాత్మకమవుతుంది. జీవితాన్ని వీలయినంత తేలికగా తీసుకో. నువ్వెంత తేలికగా తీసుకుంటే అంతగా జ్ఞానోదయానికి దగ్గరవుతావు. నువ్వెంత ఆహ్లాదంగా తీసుకుంటే నువ్వంత కాంతితో నిండుతావు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments