🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 231 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. దేవుడంటే ప్రకృతికి సంబంధించిన అంతిమ చట్టం. నీ బాధ్యతని నిర్వర్తించు. ప్రకృతి వెంటనే స్పందిస్తుంది. నువ్వు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ పోతే నీకు వరాలందుతాయి. 🍀
శాంతి దైవికం. అది దేవుడిచ్చిన వరం. దేవుడు చాలా ఉదారుడు. నువ్వు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ పోతే నీకు వరాలందుతాయి. అది వరాల కోసం చేసేది కాదు కానీ అలా జరుగుతుంది. ఐతే ఒక విషయం గుర్తుంచుకోవాలి. దాన్ని ప్రత్యక్ష్యంగా మనం ఏమీ చెయ్యలేం. కానీ దానికి సరయిన సందర్భాన్ని మనం కల్పించవచ్చు. అది పూలకు సంబంధించిన విషయం లాంటిది. పూలకు సంబంధించి సూటిగా మనం ఏమీ చెయ్యలేం. భూమిని సిద్ధం చేసి విత్తనాల్ని నాటవచ్చు. మొక్క పెరగడానికి సాయపడవచ్చు. ఎదురుచూడవచ్చు. సరయిన రుతువులో, సరయిన సందర్భం నుండి పూలను లాగలేం. అవి రావడాన్ని వాటంతట అది జరిగేలా నువ్వు అనుమతించాలి.
అవి ఒక తెలియని చోటు నించీ, మార్మికమయిన గమనం గుండా వస్తాయి. దాని కోసం సహనం అవసరం. వ్యక్తి తను ఎంత వరకు చెయ్యాలో అంతవరకు చేయాలి. తరువాత ఎదురుచూడాలి. సమయం వచ్చినపుడు పూలు వస్తాయి. అవి ఎప్పుడూ వస్తాయి. బుద్ధుడికి, లావోట్జుకు, మహావీరుడికీ వచ్చాయి. అవి నీకు కూడా వస్తాయి. దేవుడికి పక్షపాతం లేదు. ఆయన ఎవరి పట్లో యిష్టాన్ని, మరెవరి పట్లో అయిష్టాన్ని ప్రదర్శించడు. దేవుడంటే ప్రకృతికి సంబంధించిన అంతిమ చట్టం. నీ బాధ్యతని నిర్వర్తించు. ప్రకృతి వెంటనే స్పందిస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
26 Aug 2022
Comments