🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 232 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నువ్వు నిశ్శబ్దంగా కూచోడానికి, నీ శ్వాస నువ్వు వినడానికి, ఆనందంగా ఉండడానికి అలవాటు పడాలి. అదే ధ్యానం, అభినందన, నిర్మలత్వం, నిశ్చలత్వం. అది పై నించీ బహుమానంలా అందుతుంది. నీలో స్వీకరించే తత్వం వుంటే ప్రకృతి అందిస్తుంది. 🍀
వ్యక్తి ఏ కారణము లేకుండానే నిశ్శబ్దంగా కూచుని ఆనందించడం ఆరంభించాలి. ఎట్లాంటి లక్ష్యమూ వుండకూడదు. నువ్వు నిశ్శబ్దంగా కూచోడానికి, శ్వాసించడానికి, పక్షులు కిలకిలారావాల్ని వినడానికి, నీ శ్వాస నువ్వు వినడానికి, యివన్నీ ఆనందంగా చెయ్యడానికి అలవాటు పడాలి. అప్పుడు క్రమక్రమంగా నీ అస్తిత్వం నించీ కొత్త పరిమళం తీగలు సాగుతుంది.
అదే ధ్యానం, అభినందన, నిర్మలత్వం, నిశ్చలత్వం. అది పై నించీ బహుమానంలా అందుతుంది. వ్యక్తి ఎవరయినా సరే ఎప్పుడూ సిద్ధంగా వుంటే అప్పుడది సంభవిస్తుంది. అది అనివార్యం. ప్రకృతి ఎవరిపట్ల పక్షపాతం చూపదు. అర్హతని బట్టి అందిస్తుంది. ఎవరయినా ఆనందంగా వున్నారంటే వాళ్ళు అర్హత కలిగి వున్నారన్నమాట. నీలో స్వీకరించే తత్వం వుంటే ప్రకృతి అందిస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments