🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 234 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రపంచం గుండా సాగు. ప్రపంచ ప్రభావానికి లొంగకు. ఆటంకాల మధ్య నిశ్శబ్దంగా వుండే కళను నేర్చుకుంటే అప్పుడు ప్రపంచం గొప్ప సవాలుగా మిగుల్తుంది. అప్పుడే నీ నిశ్శబ్దం నిజమైంది. సాధికారమైంది, సజీవమైంది. ఆ సజీవత్వం గుండానే దైవం నీ దగ్గరకు వస్తాడు. 🍀
ఆశ్రమంలో ప్రశాంతంగా వుండడం సులభం. అక్కడ ప్రశాంతంగా వుండడం మినహా యింకే చేస్తాం? కానీ ఆ శాంతి మృతప్రాయం. అది నంపుసకత్వానికి సన్నిహితమైంది. నపుంసకుడయితే సన్యసించడం అతనికి సులువవుతుంది. అంతకు మించి అతను చేసేదేముంది? ఆటంకాల మధ్య నిశ్శబ్దంగా వుండే కళను నేర్చుకుంటే అప్పుడు ప్రపంచం గొప్ప సవాలుగా మిగుల్తుంది. అప్పుడే నీ నిశ్శబ్దం నిజమైంది. సాధికారమైంది, సజీవమైంది. అవుతుంది.
ఆ శాంతి గుండానే, ఆ సజీవత్వం గుండానే దైవం నీ దగ్గరకు వస్తాడు. దేవుడు జీవితం, ప్రాణం లేని శాంతి పూర్తిగా పనికిమాలింది. ప్రపంచంలో వుండు. ప్రపంచం కోసం వుండకు. ప్రపంచంలో వుండు. ప్రపంచాన్ని నీలోకి అనుమతించకు. ప్రపంచం గుండా సాగు. ప్రపంచ ప్రభావానికి లొంగకు. అది సాధ్యం. అది గొప్ప అద్భుతం. కానీ వీలవుతుంది. అది సంభవించినపుడు వ్యక్తి పరవశమంటే ఏమిటో తెలుసుకుంటాడు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments