🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 236 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. రాయిలా కఠినం వుండకు. మృదువుగా నీళ్ళలా వుండు'. చివర్న మృదువయింది కఠినమయిన దాని మీద విజయం సాధిస్తుంది. ఒక రోజు రాయి మాయమయి పోతుంది. సమయం పడుతుంది. అది గ్రహించడానికి అంతర్ద్రృష్టి వుండాలి. 🍀
శతాబ్దాలుగా పురుషాధిక్యాన్ని పైకెత్తారు. ప్రశంసించారు. దౌర్జన్యాన్ని, క్రూరత్వాన్ని, శౌర్యాన్ని పురుష లక్షణాలుగా చెప్పారు. స్త్రీ సంబంధమైన లక్షణాల్ని ఖండించారు. అందువల్ల గొప్ప సమస్య వచ్చింది. అందమైందంతా స్త్రీ లక్షణానికి చెందింది. ఐతే నువ్వు స్త్రీత్వాన్ని ఖండిస్తే ప్రపంచం నించీ సౌందర్యం అదృశ్యమయి పోతుంది. మనం సౌందర్యాన్ని సర్వ నాశనం చెయ్యడానికి శాయశక్తులా శ్రమించాము. కఠినమయిన దాన్ని మృదువయిన దానికి వ్యతిరేకంగా భావించి దాన్ని అభినందించాం.
లావోట్జు... రాయిలా కఠినంగా వుండకు. మృదువుగా నీళ్ళలా వుండు' అన్నాడు. చివర్న మృదువయింది కఠినమయిన దాని మీద విజయం సాధిస్తుంది. ఒక రోజు రాయి మాయమయి పోతుంది అన్నాడు. రాయి పైన నీరు పడే కొద్దీ అది కరిగిపోతుంది. నీకు కనిపించదు. కానీ సమయం పడుతుంది. అది గ్రహించడానికి అంతర్ద్రృష్టి వుండాలి. కానీ మన చూపు మందగించింది. దూరదృష్టి వుంది. ముందుకు చూస్తాం. దగ్గరివి చూడలేం. రాయిని చూస్తాం. నీటిని చూడలేం. శాశ్వతత్వాన్ని సందర్శించగలిగిన వాళ్ళకు సత్యం బోధపడుతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments