🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 237 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అహం అధికారపూర్వకం. అదెప్పుడూ మర్యాదగా మారదు. అది వినయంగా మారదు. మర్యాద, వినయం, ద్వారానే అస్తిత్వానికి దారి ఏర్పడుతుంది. మనిషి రాయిగా వుండడం కన్నా నీరుగా మారాలి. 🍀
మర్యాద అన్నది గొప్ప దైవికమయిన లక్షణం. అస్తిత్వంలో అపూర్వమయిన లక్షణం వల్ల అహం వదిలేయ బడుతుంది. అహమెప్పుడూ మర్యాద కాదు. అహం అధికారపూర్వకం. అదెప్పుడూ మర్యాదగా మారదు. అది వినయంగా మారదు. వినయంగా అది వుండడమన్నది అసాద్యం.
అది వినయంగా మారితే దాని స్థితి తలకిందులవుతుంది. మర్యాద, వినయం, ద్వారానే అస్తిత్వానికి దారి ఏర్పడుతుంది. మనిషి రాయిగా వుండడం కన్నా నీరుగా మారాలి. ఒక విషయమెప్పుడూ గుర్తుంచుకోవాలి. కాలం గడిచే కొద్దీ నీరు రాయిపై విజయం సాధిస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Комментарии