🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 238 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ఎవరూ యితర వ్యక్తి ధ్యాన తత్వాన్ని చూడలేరు. కానీ అందరూ అనురాగాన్ని చూడవచ్చు. వ్యక్తిని అల్లుకున్న ప్రేమను చూడవచ్చు. వ్యక్తే అనురాగంగా మారుతాడు. ధ్యానం లోపలికి వేళ్ళు. దాని ద్వారా అనురాగాన్ని అందుకోవచ్చు. అది అంతిమ జీవన సత్యం. 🍀
నీ జీవితం అనురాగభరితం అయితే నీలో ఆంతరిక పరివర్తన జరిగిందనడానికి అదే నిదర్శనం. అన్ని ఆందోళనలూ అదృశ్యమై కేవల నిశ్శబ్దం, కేవల శాంతి అక్కడ ఏర్పడుతుంది. నువ్వు నీ యింటికి వచ్చావు. అనురాగం దానికి సంకేతం. అదే నిదర్శన. నీ లోపలి పరివర్తనకు అది ప్రత్యక్ష నిదర్శనం. లోపల ధ్యానమేర్పడింది.
బాహ్యంలో అనురాగం బహిర్గతమైంది. లోపలి దాని వ్యక్తీకరణ అది. ఎవరూ యితర వ్యక్తి ధ్యాన తత్వాన్ని చూడలేరు. కానీ అందరూ అనురాగాన్ని చూడవచ్చు. వ్యక్తిని అల్లుకున్న ప్రేమను చూడవచ్చు. వ్యక్తే అనురాగంగా మారుతాడు. వ్యక్తే ప్రేమగా మారుతాడు. ధ్యానం లోపలికి వేళ్ళు. దాని ద్వారా అనురాగాన్ని అందుకోవచ్చు. అది అంతిమ జీవన సత్యం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comentários