🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 240 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. దేవుడు ఒక వ్యక్తి, అన్న భావాన్ని వదిలిపెట్టు. ఎక్కడో పై లోకంలో వున్నాడన్న భావాన్ని వదిలిపెట్టు. దేవుడంటే సమస్తమైన అస్తిత్వం. అది జీవితానికి మరో పేరు. జీవితాన్ని వీలయినంత సంపూర్ణంగా జీవించు. 🍀
నీ మతం భయం నించి బయట పడింది కాదు. ప్రేమ నించి బయటపడింది, వేరయింది. నరకానికి భయపడకు. నరకమన్నది లేదు. ఎప్పుడూ లేదు. మానవజాతిని మభ్యపెట్టడానికి పన్నిన వల అది. అది శతాబ్దాలుగా జరుగుతోంది. అట్లాగే స్వర్గమన్నది కూడా లేదు. స్వర్గ నరకాలు ఒక రకమైనవి వున్నాయి. అవి మానసికమయినవి. అవి నీలో వున్నాయి. ఎక్కడో లేవు. పాతాళంలో, ఆకాశంలో లేవు. వాటికి ఎట్లాంటి భౌగోళిక ఆవరణం లేదు.
స్వర్గనరకాల ఆలోచనల్ని వదిలిపెట్టు. అదంతా చెత్తా చెదారం. దేవుడు ఒక వ్యక్తి, అన్న భావాన్ని వదిలిపెట్టు. ఎక్కడో పై లోకంలో వున్నాడన్న భావాన్ని వదిలిపెట్టు. దేవుడంటే సమస్తమైన అస్తిత్వం. అది జీవితానికి మరో పేరు. జీవితాన్ని ప్రేమించు. జీవితాన్ని ఆరాధించు. జీవితాన్ని వీలయినంత సంపూర్ణంగా జీవించు. జీవితానికి నిన్ను నువ్వు సమర్పించుకో. అప్పుడు గొప్ప ఆనందం మొదలవుతుంది. దానికి ఆరంభముంటుంది కానీ అంతముండదు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Commentaires