🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 243 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నిజమైన ధ్యాని నిజమైన సంగీతకారుడు. అతను పాడవచ్చు. పాడకపోవచ్చు. కానీ అతనికి సమస్త అస్తిత్వంలో ఒక సంగీతం దాగి వుందనే రహస్యం తెలుసు. ధ్యానం సంగీతం. అది అంతిమ గానం. నిశ్శబ్ద సంగీతం. 🍀
సంగీతం గాఢమయిన ధ్యానం నించీ పుడుతుంది. సంగీతం నీ లోపలి గాఢమయిన ధ్యానాన్ని బయటకు కూడా ప్రసరిస్తుంది. కాబట్టి నిజమైన ధ్యాని నిజమైన సంగీతకారుడు. అతను పాడవచ్చు. పాడకపోవచ్చు. అతను స్వరపరచవచ్చు. లేక పోవచ్చు. కానీ అతనికి ఒక రహస్యం తెలుసు. అతని దగ్గర బంగారు తాళం చెవి వుంది. సమస్త అస్తిత్వంలో ఒక సంగీతం దాగి వుంది. అందుకనే సంగీతాన్ని ఒకానొక గొప్ప దైవిక చర్యగా అర్థం చేసుకోండి.
ధ్యానం సంగీతం. అది అంతిమ గానం. శబ్దం లేని సంగీతం. నిశ్శబ్ద సంగీతం. అది మరింత సంపన్నమైనది. అది మరింత గాఢమయింది. మనం సృష్టించే సంగీతం శబ్దాన్ని ఆధారం చేసుకున్నది. శబ్దం అల్లరి చేస్తుంది. మనం శబ్దాన్ని మధురంగా మార్చవచ్చు. అయినా అది ఆటంకమే. నిశ్శబ్ద మంటే నిరాటంకం. ఏదీ కదలదు. కానీ అక్కడ గొప్ప సంగీతముంది. పదాలు లేని సమశృతి అక్కడ వుంది. అది శబ్దాలు లేని స్థితి. ధ్యానం నిశ్శబ్ద స్థితికి చేరుస్తుంది. దాని పేరే దైవం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments