🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 251 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. దేవుడు ప్రేమ, కవి, గాయకుడు, నాట్యకారుడు, సృష్టికర్త. జనం వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడాన్ని ఇష్టపడతాడు. తమంత తాము ఎదిగే వాళ్ళని దైవం ప్రేమిస్తాడు. 🍀
జీవితమన్నది ఆనందించడానికి. జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలి. దేవుడు ఈ జీవితాన్ని సృజించాడు. దేవుడు మరీ కఠోర నియమాల్ని పాటించేవాడు కాడు. అట్లా అయితే ఈ పూలు, ఇంద్రధనసు, సీతాకోక చిలుకలూ ఎందుకుంటాయి? ఏం ప్రయోజనం కోసం వున్నాయి? దేవుడు కఠినుడు కాడు. అది మాత్రం కచ్చితం. దేవుడు ప్రేమ, కవి, గాయకుడు, నాట్యకారుడు, సృష్టికర్త. ఆయన సమగ్రవాది కాడు. ఆయన అభివృద్ధికి పరిశోధనని యిష్టపడతాడు. జనం వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడాన్ని ఆయన ఇష్టపడతాడు.
తమంత తాము ఎదిగే వాళ్ళని దైవం ప్రేమిస్తాడు. వాళ్ళు తప్పులు చేస్తారని ఆయనకు తెలుసు. తప్పులు చెయ్యకుండా ఎవరూ నేర్చుకోలేరని ఆయనకు తెలుసు. దేవుడు సన్యాసి కాడు. అది మాత్రం కచ్చితం. ఒక వేళ దేవుడనే వాడుంటే అతను తప్పకుండా నా సన్యానుల్లో ఒకడయ్యే వాడు. జీవితాన్ని, అస్తిత్వాన్ని గాఢంగా ప్రేమించేవాడు. లేకుంటే అతనీ సృష్టిని చేసేవాడు కాడు. మీరు కొత్త రకమయిన, సంగీతం, నాట్యం, ఉత్సవం కలిసిన మతభావనను తెలుసుకోవాలి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios