🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 252 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నువ్వు జీవితాన్ని పరిశీలిస్తే, జీవితం దేవుని సృష్టి అయితే ఈ జీవితం దేవుని వ్యక్తీకరణ అయితే అప్పుడు నిజంగా దేవుడంటే నాట్యం చేసే దేవుడు. పూల పరిమళంతో, ప్రేమతో, సంగీతంతో, సృజనతో నిండిన దేవుడు. 🍀
జీవితంలో ఆనందంగా వుండడమన్నది దేవుణ్ణి సమీపించడం లాంటిది. నీ మార్గంలో నాట్యం చేస్తూ దేవుణ్ణి చేరు. నీ మార్గంలో నవ్వుతూ, నీ మార్గంలో పాడుతూ దేవుణ్ణి చేరు. గంభీరంగా ముఖం వేళ్ళాడేసుకునే సన్యాసులతో దేవుడు అలసిపోయాడు. వందల ఏళ్ళ నించీ బుద్ధిహీనులుగా వున్నారు. వాళ్ళ చిత్రాలు కూడా నా గదిలో పెట్టను. వాటితో దేవుడికి పిచ్చెక్కుతుంది.
నువ్వు జీవితాన్ని పరిశీలిస్తే, జీవితం దేవుని సృష్టి అయితే ఈ జీవితం దేవుని వ్యక్తీకరణ అయితే అప్పుడు నిజంగా దేవుడంటే నాట్యం చేసే దేవుడు. పూల పరిమళంతో, ప్రేమతో, సంగీతంతో, సృజనతో నిండిన దేవుడు. దానికి జీవితం మినహా మరో వుదాహరణ లేదు. దాన్ని బట్టి దేవుడు గంభీరుడు కాదని రుజువవుతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Yorumlar