🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 255 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మన సరిహద్దుల్ని మనం కోల్పోయిన క్షణం మనం మరణాన్ని కూడా కోల్పోతాం. అప్పుడు మనం శాశ్వతంలో భాగాలవుతాం. నువ్వు అనంత సంగీతంలో భాగం అయినపుడే ధ్యానం విజయం సాధిస్తుంది. 🍀
ప్రతిదీ గాఢంగా దాని విధానంలో అది సాగుతూ వుంటుందటే మనిషి ఆ సంగతి గుర్తించడు. అప్రమత్తత లేకపోవడమే అతని దుఃఖానికి కారణం. దాని గుండా వచ్చే పీడకలలు అతన్ని బాధిస్తాయి. లేని పక్షంలో జీవితం ఒక విజయోత్సవ మయ్యేది. మనం మరికొంత నిశ్శబ్దంగా మారాలి. అప్పుడా గమనాన్ని వినగలం. కనగలం. మనం నిశ్శబ్దంగా వుంటే మనం నిశ్శబ్దంలో లీనమైతే మనం మాయమవుతాం. అప్పుడు మనమీ సమస్త విశ్వ సమశృతిలో భాగమవుతాం. ఒక దృష్టిలో మనం మాయమవుతాం. అంటే ఒక వ్యక్తిగా, ఒక అహంగా మాయమవుతాం. మరో వేపు సమస్తంలో భాగమవుతాం.
మంచు బిందువు సముద్రంలో మాయమై సముద్రంగా మారిపోయింది. అదేమీ కోల్పోదు. చిన్ని సరిహద్దుల్ని కోల్పోయి విస్తరిస్తుంది. అది భయానికి కూడా కారణమవుతుంది. అన్ని సరిహద్దులూ మరణంతో మాయమవుతాయి. మన సరిహద్దుల్ని మనం కోల్పోయిన క్షణం మనం మరణాన్ని కూడా కోల్పోతాం. అప్పుడు మనం శాశ్వతంలో భాగాలవుతాం. నువ్వు అనంత సంగీతంలో భాగమయినపుడే ధ్యానం విజయం సాధిస్తుంది. ఆ సంగీతం ఎప్పుడూ వుంది. అది వినడానికి ధ్యానం నీకు సహకరిస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments