🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 258 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. 'తమసోమా జ్యోతిర్గమ' దేవా చీకటి నించీ నన్ను కాంతిలోకి నడిపించు, అసతోమా సద్గమయ అసత్యం నించీ సత్యానికి నడిపించు. మృత్యోర్మా అమృతంగమయ మరణం నించీ మరణ రాహిత్యానికి నడిపించు. ఇది అపూర్వమైన ప్రార్థన. 🍀
ప్రాచీన ఉపనిషత్ కాలం ఋషులు అద్భుతమయిన ప్రార్థన చేశారు. ప్రపంచంలోని అద్భుత ప్రార్థన అది. 'తమసోమా జ్యోతిర్గమ' దేవా చీకటి నించీ నన్ను కాంతిలోకి నడిపించు, అసతోమా సద్గమయ అసత్యం నించీ సత్యానికి నడిపించు. మృత్యోర్మా అమృతంగమయ మరణం నించీ మరణ రాహిత్యానికి నడిపించు. ఇది అపూర్వమైన ప్రార్థన. వేల సంవత్సరాల క్రితందయినా యిప్పటికి ఎంతో విలువైంది. యిప్పుడూ దీని ప్రాధాన్యం మరింత వుంది. నేను చీకటి నించీ వెలుగుకు నడిపించమని చెప్పను. ఎందుకంటే చీకటి వునికిలో లేదు. నన్ను కాంతి నించీ మరింత కాంతికి నడిపించమని కోరుతాను.
అట్లాగే అసత్యం నుండి సత్యానికి నడిపించమని కోరను. ఎందుకంటే అసత్యం లేదు. సత్యం నించీ మరింత సత్యానికి నడిపించమంటాను. అట్లాగే మరణం నించీ మరణం లేని తనానికి నడిపించమనను. ఎందుకంటే మరణమన్నది లేదు. మరణరాహిత్యం నించీ మరింత మరణ రాహిత్యానికి నడిపించమంటాను. జీవితం నించీ మరింత నిరాటంక జీవితానికి సమగ్రత నించీ మరింత సమగ్రతకు నడిపించ మంటాను. సాధారణంగా సమగ్రత అంటే దాన్ని మించి లేదని, అదే ముగింపు అని అంటారు. నేనట్లా అనుకోను. సమగ్రత మరింత సమగ్రత కావాలి. ప్రతి దశా ఒక సమగ్రతే. అది మరింత సంపన్నంగా, వర్ణభరితంగా మారుతూ సాగాలి. కొత్త నాట్యం, కొత్త ఉత్సవం, పరిణామానికి అంతముండదు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios