నిర్మల ధ్యానాలు - ఓషో - 261
- Prasad Bharadwaj
- Nov 19, 2022
- 1 min read

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 261 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనం దూరంగా వున్న దాని పట్ల ఆకర్షింప బడతాం. దగ్గరున్న దాని పట్ల దృష్టి పెట్టం. మన లోపలికి వెళితే మనలో వున్న ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాం. 🍀
మనం శక్తివంతులంగా పుట్టిన మాట వాస్తవం. ఉన్నత శిఖరాలకు ఎదిగే శక్తి వున్నదన్నది నిజం. కానీ ఆ శక్తిని మనం వినియోగించాలి. దానికో పద్ధతి కావాలి. ఒక రకమయిన శాస్త్రీయత అవసరం. అదేమంత కష్టం కాదు. దానికి శాస్త్రీయమయిన ధ్యానం అవసరం. మనం దూరంగా వున్న దాని పట్ల ఆకర్షింప బడతాం. దగ్గరున్న దాని పట్ల దృష్టి పెట్టం.
మన లోపలికి వెళితే మనలో వున్న ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాం. మనలోని ఆకాశానికి దిగ్భ్రమ చెందుతారు. అపూర్వ సౌందర్యానికి అబ్బురపోతాం. దాన్ని యింతకాలం ఎలా మరిచిపోయా? ఎలా కోల్పోయాం? అని నివ్వెరపోతాం. దాని వల్ల నీ సమస్త అస్తిత్వం స్వర్గకాంతులు చిమ్ముతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments