నిర్మల ధ్యానాలు - ఓషో - 262
- Prasad Bharadwaj
- Nov 21, 2022
- 1 min read

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 262 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నీ ఆలోచనలు, మనసు, నీ అహం యివన్నీ మాయమయి పోయినపుడే ఆ గాఢ నిశ్శబ్దంలోనే నువ్విక్కడికి యాదృచ్చికంగా రాలేదని అస్తిత్వానికి సంబంధించి ఒక ప్రత్యేకమయిన పనిని నిర్వర్తించడానికి వచ్చావని గ్రహిస్తావు.🍀
ఒకసారి నువ్వు ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెడితే నీ దృష్టి, దృక్పథం మారిపోతాయి. నువ్విక్కడికి యాదృచ్చికంగా రాలేదని అస్తిత్వానికి సంబంధించి ఒక ప్రత్యేకమయిన పనిని నిర్వర్తించడానికి వచ్చావని గ్రహిస్తావు. అస్తిత్వం నీ వెనకనే వుంటుంది.
నీ ఆలోచనలు, మనసు, నీ అహం యివన్నీ మాయమయి పోయినపుడే ఆ గాఢ నిశ్శబ్దంలోనే నువ్వా సంగతి గ్రహిస్తావు. ఆ స్పష్టతలో అన్ని మేఘాలూ అదృశ్యమయినపుడు నీ ముందు సూర్యుడు వెలుగుతాడు. ఆ కాంతిలో జీవితం రూపాంతరం చెందుతుంది. అప్పుడు జీవితానికి అర్థం, ప్రత్యేకత ఏర్పడతాయి. వాటి నించి ఉల్లాసం, ఆనందం వస్తాయి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Kommentarer