🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 264 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. జీవితం సంపూర్ణమయిన 'అవును' కావాలి. ఐతే దాన్ని మనం పూర్తిగా మార్చేశాం. కాదు'లన్నిట్నీ కరిగించి 'అవును'లుగా పోత పోయాలి. అది అందరికీ వర్తిస్తుంది. అది అసాధ్యం కాదు. 🍀
నువ్వు ఒక మనిషి లోపల అన్వేషిస్తే కాదు అన్న వాటికి సంబంధించి గుంపులు కనిపిస్తాయి. కాదు, కాదు, కాదు, కాదు. తవ్వేకొద్దీ అవే వస్తూ వుటాయి. చాలా పెద్దవి వస్తాయి. 'అవును' అన్నది చాలా అరుదుగా కనబడుతుంది. ఎక్కడో ఒకటి కనిపించినా అది నీరసంగా, నలిగిపోయి వుంటుంది. 'పేద' అవును తొక్కిడిలో నలిగి వుంటుంది. ఎక్కడో మూల అది వున్నా కొనవూపిరితో వుంటుంది. జీవితం సంపూర్ణమయిన 'అవును' కావాలి. ఐతే దాన్ని మనం పూర్తిగా మార్చేశాం. కాదు'లన్నిట్నీ కరిగించి 'అవును'లుగా పోత పోయాలి. అది అందరికీ వర్తిస్తుంది. అది అసాధ్యం కాదు.
బుద్ధుడి నించీ లావోట్జు వరకు అందరికీ అది జరిగింది. అది నీకూ సాధ్యం కావచ్చు. దాన్ని నేను వచనం నించీ కవిత్వానికి మారడమంటాను. అది గణితం నించీ సంగీతానికి మారడం. అప్పుడు జీవితమే ఒక పాట పరవశం. నేను మత సంబంధమయిన విషాదాన్ని బోధించను. శరీర హింసను బోధించే, ఆత్మహింసను బోధించే మతాలకు నేను వ్యతిరేకిని. ప్రేమ పునాది వున్న భయం లేని వర్తమాన పునాదులున్న, భవిష్యత్తుతో సంబంధించని, హేతువు పునాదిగా లేని ప్రేమపునాదిగా వున్న కొత్త మతాన్ని నేను ప్రవచిస్తాను.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments