🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 265 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అహమెప్పుడు 'కాదు' అంటుంది. కాదు అన్నది అహానికి ఆహారం. అవును అన్నది సృజనాత్మకం. అవును' అన్నది సృజనకారుడి మార్గం. ప్రేమికుడి మార్గం. సమస్తానికి లొంగిపోవడం. అవును అంటే శరణం, కాదు అంటే యుద్ధం.🍀
మనిషి 'కాదు' లో లేదా 'అవును'లో జీవించవచ్చు. నువ్వు 'కాదు'లో నీ జీవితాన్ని జీవిస్తే నువ్వు యుద్ధవీరుడవుతావు. ఎప్పుడూ సంఘర్షణలో వుంటావు. అప్పుడు జీవితం కేవలం ఘర్షణ అవుతుంది. నువ్వు ప్రతిదానికీ వ్యతిరేకంగా పోట్లాడతావు. అది ఓడిపోయే యుద్ధమే కావచ్చు. నువ్వు ఓటమికి సిద్ధం కావాలి. వ్యక్తి సమస్తానికి వ్యతిరేకంగా పోరాడి గెలవలేడు. ఆ అభిప్రాయమే తప్పు. కానీ అహం అలా అంటుంది. అహమెప్పుడు 'కాదు' అంటుంది. కాదు అన్నది అహానికి ఆహారం. అవును అన్నది సృజనాత్మకం. అవును' అన్నది సృజనకారుడి మార్గం. ప్రేమికుడి మార్గం.
అవును అంటే శరణం, కాదు అంటే యుద్ధం, అవును' అంటే లొంగిపోవడం. సమస్తానికి లొంగిపోవడం. సమస్తానికి లొంగడంలో సంఘర్షణ లేదు. అవును'కు ఎట్లాంటి నిబంధనలూ పెట్టకు. అప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. జీవితం సరిహద్దులు దాటి సాగుతుంది. జీవితంలో కాంతి వస్తుంది. సౌందర్యం వస్తుంది. అనూహ్యమైన దయ వస్తుంది. జీవితం అన్నది అంతం లేని పరవశ మవుతుంది. దానికి నువ్వు తలుపులు, కిటికీలు తెరవాలి. సూర్యుడికి, చంద్రుడికి, వర్షానికి, సమస్తానికి 'అవును' అని ఆమోదం తెలుపు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments