🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 267 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. సాహసం నిండిన, పరవశం, సన్నిహితం, అపాయం, ప్రమాదం, తెలివి, చైతన్యం, స్పృహ నిండిన వాతావరణంలో లోపలి అస్తిత్వం విచ్చుకోవడం మొదలు పెడుతుంది. 🍀
నువ్వు అజ్ఞాతపు లోతుల్లోకి వెళ్ళేకొద్దీ నీకు తెలియనివెన్నో ఎదురవుతాయి. వాటిని చూసి దిగ్రమకు లోనవుతావు. నువ్వు అజ్ఞాతానికి భయపడని క్షణం, తెలియనిదేదో నీ తలుపు తడుతుంది. తెలియని దాని వేపు చేసే ప్రయాణంలో ఎన్నో సవాళ్ళని కూడా ఎదుర్కోవాల్సి వుంటుంది. ఎంతో చైతన్యంతో స్పృహతో వుండాల్సి వుంటుంది.
అట్లా వుంటే నీ తెలివితేటలు చురుగ్గా వుంటాయి. పరవశం పదింతలు అవుతుంది. ప్రతి క్షణం అద్భుతంగా వుంటుంది. సాహసం నిండిన, పరవశం, సన్నిహితం, అపాయం, ప్రమాదం, తెలివి, చైతన్యం, స్పృహ నిండిన వాతావరణంలో లోపలి అస్తిత్వం విచ్చుకోవడం మొదలు పెడుతుంది. మొగ్గ పువ్వవుతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comentários