నిర్మల ధ్యానాలు - ఓషో - 268
- Prasad Bharadwaj
- Dec 3, 2022
- 1 min read

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 268 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. దేవుడు ఎవడి జీవితంలోనూ జోక్యం చేసుకోడు ఎందుకంటే ఆయన సృష్టిని ఆయన ప్రేమిస్తాడు. కాబట్టి ప్రతివ్యక్తిని స్వేచ్ఛగా వదలి పెడతాడు. 🍀
నువ్వు అజ్ఞాతానికి భయపడని క్షణం, తెలియనిదేదో నీ తలుపు తడుతుంది. నువ్వు భయపడితే అది నీకు ఆటంకం కలిగించదు. దేవుడు ఎవడి జీవితంలోనూ జోక్యం చేసుకోడు ఎందుకంటే ఆయన సృష్టిని ఆయన ప్రేమిస్తాడు. కాబట్టి ప్రతివ్యక్తిని స్వేచ్ఛగా వదలిపెడతాడు.
తనకు వ్యతిరేకంగా వున్నా వదిలిపెడతాడు. అది స్వేచ్ఛలో భాగం. కానీ అట్లా వ్యతిరేక దృష్టితో స్వేచ్ఛను ఉపయోగించడం తప్పు. స్వేచ్ఛని పాజిటివ్ మార్గంలో ఉపయోగించాలి. అజ్ఞాత అతిథిని ఆహ్వానించడానికి స్వేచ్ఛను వుపయోగించాలి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comentários