top of page
Writer's picturePrasad Bharadwaj

నిర్మల ధ్యానాలు - ఓషో - 271


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 271 🌹


✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ


🍀. లోపలి పర్వతాల్ని అధిరోహించిన వాళ్ళు కొందరే. కానీ లోపలికి సాగే కొద్దీ వ్యక్తి మరింత చైతన్యంతో వుంటాడు. స్పృహతో వుంటాడు. కత్తి మీద సాము చేస్తాడు. గతాన్ని గురించి, భవిష్యత్తును గురించి ఆలోచించడు. అతనికీ క్షణం చాలు 🍀


ప్రమాదంలోని అద్భుతమయిన విషయమేమిటంటే అది నిన్ను చురుగ్గా వుంచుతుంది. చైతన్యంతో వుంచుతుంది. మెలకువతో వుంచుతుంది. కాబట్టి తెలియని శిఖరాన్ని అధిరోహించే వాళ్ళు చైతన్యంతో వుంటారు. వాళ్ళు దేనికోసం అన్వేషిస్తున్నారో వాళ్ళకు తెలీదు. ఉత్తర దక్షిణ ధృవాల్ని అన్వేషించిన వాళ్ళకి, చంద్రుడి దగ్గరకు వెళ్ళిన వాళ్ళకు వాళ్ళ అన్వేషణ ఎక్కడికి తీసుకు వెళుతుందో తెలీకుండా ప్రయాణించారు. ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్నారు. వాళ్ళు చైతన్యంతో మాత్రం వున్నారు. ధ్యాని స్పృహతో సాగుతాడు.


అతనిలో అనంత విశ్వముందని అతనికి తెలుసు. కానీ పర్వతారోహణ కన్నా, చంద్రయాణం కన్న ప్రమాదకరమైంది . లోపలి పర్వతాల్ని అధిరోహించిన వాళ్ళు కొందరే. కానీ లోపలికి సాగే కొద్దీ వ్యక్తి మరింత చైతన్యంతో వుంటాడు. స్పృహతో వుంటాడు. కత్తి మీద సాము చేస్తాడు. గతాన్ని గురించి, భవిష్యత్తును గురించి ఆలోచించడు. అతనికీ క్షణం చాలు. యిప్పుడు యిక్కడ వుంటాడు. అందువల్ల పడిపోవడమంటూ వుండదు. కానీ అక్కడ ప్రమాదముంది. ప్రమాదం వుండడం వల్లే అప్రమత్తత ఏర్పడుతుంది.



సశేషం ...


🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post
bottom of page