🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 273 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. పడిపోవడం సులభం. దానికి ఎట్లాంటి ప్రయత్నమూ అక్కర్లేదు. పైకి వెళ్ళడానికి, శిఖరాన్ని అందుకోవడానికి నువ్వు తీవ్ర ప్రయత్నం చేయాలి. ప్రతిక్షణం పట్లా అప్రమత్తంగా వుండాలి. 🍀
మనిషి నిచ్చెన. మనిషికి ఎన్నో అవకాశాలు వున్నాయి. అందువల్ల ప్రమాదం, గౌరవం కీర్తి, బాధ వున్నాయి. పడిపోవడం సులభం. ఎప్పుడూ సులభమే. దానికి ఎట్లాంటి ప్రయత్నమూ అక్కర్లేదు. పైకి వెళ్ళడానికి ప్రయత్నం అవసరం. మరింత పైకి వెళ్ళడానికి మరింత ప్రయత్నం అవసరం. శిఖరాన్ని అందుకోవడానికి నువ్వు తీవ్ర ప్రయత్నం చేయాలి. మనిషి అన్నీ తనకు ఆందాయి అనుకోకూడదు.
మనిషి సంభవాల స్ఫటికం. మనిషిలో ఔన్నత్యమూ అదే, మనిషి కష్టము అదే. వునికిలో అత్యంత ఆందోళన కలిగిన జంతువు మనిషే. అతనెప్పుడూ నాలుగు రోడ్ల కూడలిలో వుంటాడు. అతను ప్రతిక్షణం పట్లా అప్రమత్తంగా వుండాలి. ఏదయినా జరగచ్చు. జరగక పోవచ్చు. వీలు కావచ్చు. కాకపోవచ్చు. సత్వాన్వేషణ అన్నది ఒక నిర్ణయం. అంతిమ శిఖరాన్ని అందుకునే నిర్ణయం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments