🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 275 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మన అస్తిత్వం సమస్త ఆకాశాన్ని కోరుతుంది. లేని పక్షంలో ప్రతిదీ నిశ్చేతనంగా నిలబడిపోతుంది. మనిషి ఎటువంటి హద్దులకు సంతృప్తి పడకూడదు. ఎప్పుడు ఎటువంటి హద్దు ఎదురయినా దాన్ని దాటి వెళ్ళాలి. 🍀
పరిమితుల్లో వుండడం అంటేే చీకటిలో వుండడమే. అమర్యాదకరమే. కారణం మన అస్తిత్వం సమస్త ఆకాశాన్ని కోరుతుంది. అప్పుడే అది నాట్యం చేస్తుంది. పాట పాడుతుంది. లేని పక్షంలో ప్రతిదీ నిశ్చేతనంగా నిలబడిపోతుంది. అప్పుడు విహరించడానికి ఆకాశముండదు. కదలడానికి స్థలముండదు. అప్పుడు మనిషి హద్దుల్లో వుండాలి.
శరీర హద్దులో, మనసు హద్దులో, ఉద్వేగాల హద్దులో ఆగాలి. ఇవి హద్దులకున్న పరిమితులు. ఈ హద్దుల్ని రూపాంతరం చెందించాలి. మనిషి ఎటువంటి హద్దులకు సంతృప్తి పడకూడదు. ఎప్పుడు ఎటువంటి హద్దు ఎదురయినా దాన్ని దాటి వెళ్ళాలి. అన్నిట్నీ మార్చాలి. నువ్వు శాశ్వతత్వాన్ని సమీపించినపుడు నువ్వు అస్తిత్వాన్ని సమీపిస్తావు. ఇంటికి చేరుతావు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
コメント