🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 276 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. బురద నుండి అపూర్వ సౌందర్య భరితమైన పుష్పం పుడుతుంది. అలాగే మనిషిలో బీజంగా పద్మముంది. అందుకని మనిషిని ఆమోదించాలి. కారణం దాంట్లో సౌందర్యం దాగి వుంది. 🍀
పద్మం బురద నించీ పుడుతుంది. మురికి నిండిన బురద నుండి అపూర్వ సౌందర్య భరితమైన పుష్పం పుడుతుంది. అంటే బురద మట్టిలో ఏదో సౌందర్య భరితమయింది దాగుంది. కాబట్టి బురద మట్టిని తిరస్కరించకు. దాంట్లో కలువపూలు వున్నాయి. అంత మనోహరమయిన పరిమళమున్న మహా సుకుమారమయిన పుష్పం.
ధవళకాంతితో మెరిసే పద్మం బురద నించి వచ్చిన సంగతి మరిచిపోకూడదు. మనిషి సాధారణ మట్టిగా పుట్టాడు. కానీ మనిషిలో పద్మముంది. కేవలం బీజంగా వుంది. మనిషిని తిరస్కరించ కూడదు. మనిషిని ఆమోదించాలి. రూపాంతరం చెందించాలి. కారణం దాంట్లో సౌందర్యం దాగి వుంది. అది లోపల దాగి వుంది. దాన్ని ఉపరితలానికి తీసుకురావాలి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comentários