🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 279 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ధ్యానం పునర్జన్మనిస్తుంది. మొదటి భౌతిక జన్మ రెండోది ఆధ్యాత్మిక జన్మ. పుట్టినప్పుడు నువ్వు భౌతికంగా నువ్వు కాంతిలో వుంటావు. తరువాత నీకు ఇంకో జన్మ కావాలి. అప్పుడు నీకు మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా సంపూర్ణ కాంతి లభిస్తుంది. 🍀
ఒకసారి విత్తనం మొలకెత్తితే భూమి పైకి వస్తుంది. సూర్యుడి కేసి సాగుతుంది. చంద్రుడి కేసి సాగుతుంది. నక్షత్రాల కేసి సాగుతుంది. బిడ్డ పుడతాడు. భౌతికంగా అతను కాంతిలోకి వస్తాడు. కానీ, ఆధ్యాత్మికంగా అతనింకా చీకట్లోనే వుంటాడు. ఆ చీకట్ని కేవలం ధ్యానం గుండానే వదిలించుకోవడం వీలవుతుంది. అందువల్ల ధ్యానం పునర్జన్మనిస్తుంది. మొదటి భౌతిక జన్మ రెండోది ఆధ్యాత్మిక జన్మ.
పుట్టినప్పుడు నువ్వు భౌతికంగా కాంతిలో వుంటావు. తరువాత నీకు ఇంకో జన్మ కావాలి. అప్పుడు నీకు మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా సంపూర్ణ కాంతి లభిస్తుంది. కాంతి అస్తిత్వానికి యింకో పేరు. నువ్వు కాంతిలోకి అడుగిడిన మరుక్షణం నువ్వు జ్ఞానోదయం పొందుతావు. అప్పుడు నువ్వు యిద్దరు కావు. నీలో ద్వైదీభావం వుండదు. నువ్వు కాంతిని చూసేవాడివి కావు. మీరు ఒకటవుతారు. నువ్వు కాంతివవుతావు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comentários