🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 280 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ఒకసారి నువ్వు సిద్ధపడితే నువ్వు ఆశ్చర్యపోతావు. సమస్త అస్తిత్వం గొప్ప కవిత్వ పరిమళంతో కళకళలాడుతోంది. వ్యక్తి అన్నిటిలో అర్థాన్ని వెతకాల్సిన పన్లేదు. అప్పుడది తాత్విక అన్వేషణ అవుతుంది.🍀
పక్షుల నుంచి వాటి పాటల్ని నేర్చుకో. వృక్షాల నించీ నాట్యాన్ని నేర్చుకో. నదుల నించీ సంగీతం నేర్చుకో. ఒకసారి నువ్వు సిద్ధపడితే నువ్వు ఆశ్చర్యపోతావు. సమస్త అస్తిత్వం గొప్ప కవిత్వ పరిమళంతో కళకళలాడుతోంది. వ్యక్తి అన్నిటిలో అర్థాన్ని వెతకాల్సిన పన్లేదు. అప్పుడది తాత్విక అన్వేషణ అవుతుంది. నువ్వు 'దీని అర్థమేమిటి?' అని అడిగిన క్షణం నువ్వు కవిత్వ మార్గం నించి తప్పుకుంటావు.
'ఈ చెట్టు గాల్లో ఎందుకు కదులుతోంది' అని నువు అడగని క్షణం నువ్వు కవితాత్మకంగా మారతావు. అప్పుడు అద్భుతాలకు అద్భుతం సంభవం. అర్థాన్ని లక్ష్యపెట్టని వ్యక్తికి అప్పుడు అర్థం తెలిసి వస్తుంది. చెట్లతో నాట్యం చేయి. పిట్టలతో పాటలు పాడు. సముద్రంలో ఈతకొట్టు. ఎట్లాంటి అన్వేషణతో సంబంధం లేకుండా నీకు అర్థం తెలిసి వస్తుంది. నువ్వు ఈ అద్భుత అస్తిత్వంలో భాగమవుతావు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments