🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 281 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రతి మనిషి తన హృదయంలో ఒక పాటతో వస్తాడు. నీ పాట నువ్వు పాడకుంటే నువ్వు అసంపూర్ణంగా మిగిలిపోతావు. నీకేది నచ్చితే ఆ పని చేయి. యితర్లు చెప్పిన దాన్ని పట్టించుకోకు. ఎట్లాంటి పరిస్థితులకీ లొంగకు.🍀
నీ పాట నువ్వు పాడు. ప్రతి మనిషి తన హృదయంలో ఒక పాటతో వస్తాడు. నీ పాట నువ్వు పాడకుంటే నువ్వు అసంపూర్ణంగా మిగిలిపోతావు. నువ్వు నీ పని చేయాలి. నీకేది నచ్చితే ఆ పని చేయి. యితర్లు చెప్పిన దాన్ని పట్టించుకోకు. లెక్కపెట్టకు. ఎట్లాంటి పరిస్థితులకీ లొంగకు. రాజీపడకు.
కవి నిజంగా విప్లవకారుడు. రాజీపడడు. రాజీపడితే అతను కవి కాడు. అతను వ్యాపారస్థుడవుతాడు. నువ్వు రాజీపడకపోతే నీ ప్రేమ సరిహద్దులు దాటి సాగుతుంది. పాట పాడు. నీ అంతరాంతరాల నించీ అజ్ఞాత తీరాల నించీ ప్రేమ రావడం చూస్తావు. అది నీ నించీ పొంగిపొర్లుతుంది. యితరుల్ని చేరుతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments