🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 282 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. గురువు చేసే పని నువ్వు నిశ్శబ్దంగా వుండడానికి సహకరించడం. దాని వల్ల నీ లోపలి గుసగుసల్ని వినగలుగుతావు. అప్పుడు నీ జీవితం లోపలి క్రమశిక్షణ వేపు కదుల్తుంది. నువ్వు నీ అంతర్దృష్టిని కనిపెట్టడానికి నేను సహకరిస్తాను. అప్పుడ నువ్వు స్వేచ్ఛను పొందుతావు. 🍀
నువ్వు నిశ్శబ్దంగా వున్నపుడు నీ శక్తి నీతో మాట్లాడుతుంది. నీతో గుసగుసలాడుతుంది. ఆ గుసగుసలు విస్పష్టమైనవి. అక్కడ 'ఐతే' ఒకవేళ లాంటివి వుండవు. హృదయానికి ఐతే, ఒక వేళ లాంటివి తెలీవు. అది కేవలం యిది నీ విధి అంటుంది. నువ్వు కవివి, చిత్రకారుడివి, శిల్పివి, నాట్యకారుడివి, సంగీతకారుడివి అంటుంది. నువ్వు సమగ్రత చెందడానికి అదే మార్గమంటుంది. అది నీకు దారి చూపిస్తుంది.
గురువు చేసే పని నువ్వు నిశ్శబ్దంగా వుండడానికి సహకరించడం. దాని వల్ల నీ లోపలి గుసగుసల్ని వినగలుగుతావు. అప్పుడు నీ జీవితం లోపలి క్రమశిక్షణ వేపు కదుల్తుంది. నువ్వు నీ అంతర్దృష్టిని కనిపెట్టడానికి నేను సహకరిస్తాను. అప్పుడ నువ్వు స్వేచ్ఛను పొందుతావు. కాబట్టి సాధన అన్నది, సన్యాసమన్నది కట్టుబాటుకాదు. అది స్వేచ్ఛా ప్రకటన. అది వ్యక్తి ప్రకటన. అది ప్రేమ ప్రకటన. సృజన ప్రకటన.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments