🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 284 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నవ్వుతూ, ఆడుతూ పాడుతూ వుండు. సాధారణ జీవితం గడుపు, వినయ మార్గంలో సాగు. ఎట్లాంటి కోరికలూ లేకుండా, ఏదో కావాలని అనుకోకుండా వుండు. ఏదో సాధించాలనుకోకు. ఎందుకంటే జీవితం దాని సాధారణ స్థాయిలో ఎంతో అద్భుతమైంది. 🍀
ఆనందించ గలిగిన వ్యక్తికి టీ తాగడం కూడా ప్రార్థనలాంటిదే. ఉత్సాహం నూతన దృష్టి నిస్తుంది. కొత్త కోణాన్ని చూపుతుంది. అది సమస్త ప్రపంచాన్ని రూపాంతం చెందిస్తుంది. కట్టెలు కొట్టడం. నీళ్ళు తోడడం చాలా గొప్ప పనులతో సమానమయినవే. కాబట్టి దిగులుగా వుండకు, సీరియస్ గా వుండకు.
నవ్వుతూ, ఆడుతూ పాడుతూ వుండు. సాధారణ జీవితం గడుపు, వినయ మార్గంలో సాగు. ఎట్లాంటి కోరికలూ లేకుండా, ఏదో కావాలని అనుకోకుండా వుండు. ఏదో సాధించాలనుకోకు. ఎందుకంటే జీవితం దాని సాధారణ స్థాయిలో ఎంతో అద్భుతమైంది. అక్కడ ఎట్లాంటి అభివృద్ధి అయినా దాని సాధారణ సౌందర్యాన్ని నాశనం చేస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments