🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 285 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. వ్యక్తి నిరంతరం గానం చేసే స్థితిలో వుండాలి. ఏ క్షణమయినా సూర్యోదయం కావచ్చు. నువ్వు దాన్ని ఆహ్వానించాలి. స్వీకరించే గుణంతో వుండాలి. చురుగ్గా వుండాలి. 🍀
వ్యక్తి తన హృదయ రంద్రాల్ని తెరిచి అస్తిత్వాన్ని ఆహ్వానించిన స్థితికి పాట ప్రాధాన్యం వహిస్తుంది. పాట ప్రతీకాత్మకం. అది బాధ కాదు. పక్షులు ఉదయాన్నే పాట పాడుతాయి. అట్లా వ్యక్తి నిరంతరం గానం చేసే స్థితిలో వుండాలి. ఉదయాన్నే సూర్యోదయంలో ఉత్సాహంగా గానం చెయ్యడానికి సిద్ధంగా వుండాలి.
ఏ క్షణమయినా సూర్యోదయం కావచ్చు. నువ్వు దాన్ని ఆహ్వానించాలి. స్వీకరించే గుణంతో వుండాలి. చురుగ్గా వుండాలి. అతిథి ఏ సమయంలోనైనా రావచ్చు. పాట పాడే పక్షులు సూర్యుడికి ఆహ్వానం పలకడానికి సిద్ధంగా వుండాలి. పూలు విచ్చుకుంటాయి. గాలికి చెట్లు కదుల్తాయి. సమస్త ప్రపంచం సజీవంగా సంచలిస్తుంది. కొత్త రోజుని ఆహ్వానించడానికి సిద్ధపడుతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios