🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 286 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. బాధతో చేసే ప్రార్థన, కష్టపడి చేసే ప్రార్థన ఆరంభం నించీ పొరపాటుగానే వుంటుంది. దానికి రెక్కలుండవు. అది దేవుణ్ణి చేరలేదు. ఆనందంగా వున్న వ్యక్తి, ఆమయకంగా వున్న వ్యక్తి, ప్రతిదాన్నీ అద్భుతంగా చూసే వ్యక్తి, ఆశ్చర్యంగా చూసే వ్యక్తి దేవుణ్ణి సులభంగా సమీపిస్తాడు. 🍀
పాట పాడే హృదయం, నాట్యం చేసే హృదయం, ప్రేమించే హృదయం దేవుణ్ణి ఆహ్వానించడానికి సిద్ధంగా వుంటాయి. బాధతో చేసే ప్రార్థన, కష్టపడి చేసే ప్రార్థన ఆరంభం నించీ పొరపాటుగానే వుంటుంది. దానికి రెక్కలుండవు. అది దేవుణ్ణి చేరలేదు. ఆనందంగా వున్న వ్యక్తి, ఆమయకంగా వున్న వ్యక్తి, ప్రతిదాన్నీ అద్భుతంగా చూసే వ్యక్తి, ఆశ్చర్యంగా చూసే వ్యక్తి దేవుణ్ణి సులభంగా సమీపిస్తాడు.
మహాత్ములందరూ, హృదయాన్ని తెరిచి వుంచు. దైవం ప్లవేశిస్తాడు అన్నారు. నువ్వు దాన్ని గురించి ఆందోళన పడకు. పాట పాడు, దైవం 'నేను లోపలికి రావచ్చా?' అంటాడు. నువ్వు ఆనందంగా వుండు. దేవుడు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. ఆయన్ని నీ వద్దకు తనంతట తను రావడానికి ప్రేరేపించు!
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments