🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 288 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మిమల్ని మీరు సిద్ధపరచండి. సమయం వచ్చినపుడు, మీలో పరిణితి ఏర్పడినపుడు దేవుడు మీకు ఆవిష్కారమవుతాడు. సిద్ధం కావడమంటే ఆనందించడమే, విచ్చుకోవడమే, పాడడమే, ఆడడమే, ప్రేమించడమే, ధ్యానించడమే. 🍀
చాలా మంది దేవుణ్ణి వెతుకుతారు. ఆయన్ని కలవడానికి తాము సిద్ధంగా వున్నామా? లేదా? అని ఆలోచించాలి. వాళ్ళు సిద్ధంగా వున్నపుడే వెతకాలి. వాళ్ళకా ఆలోచన రాదు. నేను ఏమంటానంటే దేవుణ్ణి మరచిపోండి. మొదట మిమల్ని మీరు సిద్ధపరచండి. సమయం వచ్చినపుడు, మీలో పరిణితి ఏర్పడినపుడు దేవుడు మీకు ఆవిష్కారమవుతాడు.
దాన్ని గురించి మీరు బాధపడాల్సిన పన్లేదు. అసలు దేవుడి గురించే ఆలోచించాల్సి పన్లేదు. మీ ఆలోచన మీకు సాయపడదు. సిద్ధం కావడమంటే ఆనందించడమే, విచ్చుకోవడమే, పాడడమే, ఆడడమే, ప్రేమించడమే, ధ్యానించడమే. అప్పుడు అన్ని కోణాలు. నీ అస్తిత్వ దళాలు విచ్చుకోవడం మొదలుపెడతాయి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments