🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 289 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నువ్వు శాశ్వతత్వాన్ని అందుకోడానికి, నువ్వు విశాలం కావడానికి, అపరిమితం కావడానికి, అవ్యక్తం కావడానికి ఆధ్యాత్మ ప్రయాణం దోహద పడుతుంది. 🍀
నదిలో బాటు ప్రవహించు. నదితో బాటు నడువు. నదిలో నిన్ను నువ్వు విస్మరించు. నది అప్పటికే సముద్రం వేపు సాగుతోంది. అది నిన్ను కూడా సముద్రం వేపు తీసుకుపోతుంది. నువ్వు ఈత కొట్టాల్సిన పన్లేదు. సముద్రం దేవుడికి ప్రాధాన్యం వహిస్తుంది. మనం సముద్రాన్ని చూడందే సంతృప్తిపడం. పరిమితుల వల్ల, సరిహద్దుల వల్ల, సముద్రాన్ని చూడలేం.
ఏ క్షణం నది సముద్రంలో కలుస్తుందో ఆ క్షణమే అది శాశ్వతత్వాన్ని సంతరించుకుంటుంది. ఆనంత మవుతుంది. ఆధ్యాత్మిక సాధనకు అదే లక్ష్యం. నువ్వు శాశ్వతత్వాన్ని అందుకోడానికి, నువ్వు విశాలం కావడానికి, అపరిమితం కావడానికి, అవ్యక్తం కావడానికి ఆధ్యాత్మ ప్రయాణం దోహద పడుతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments