🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 290 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. కోరిక అంటే సమస్తానికి వ్యతిరేకంగా సాగడం. అది అసాధ్యమైన లక్ష్యం. అది వీలుపడదు. కోరిక లేకపోవడమంటే అనంతంతో బాటు ఆహ్లాదంగా గడపడం, దాంతో సాగడం, అంటే సొంత కోరిక లేకపోవడం. 🍀
మనిషి తన జీవితాన్ని కలల ఇసుకతో కట్టుకుంటాడు. కాబట్టే వ్యక్తి ఏం చేసినా ప్రతిదీ నిష్పలమవుతుంది. అన్ని ఇళ్ళు కూలిపోతాయి. దాని పునాదులు శాశ్వతత్వంలో వుండవు. క్షణికమయిన దాంట్లో వుంటాయి. ఒక ఇసుక భవనం కూలిపోతే వ్యక్తి మరొక దాన్ని నిర్మిస్తాడు. ఒక కల మాయమైతే మరొక కల కంటాడు. ఒక కోరిక నెరవేరకుంటే యింకొక కోరికలోకి దూకుతాడు. ఆ కాంక్ష వైఫల్య పునాదిగా వున్నదని గుర్తించం. కోరిక అంటే సమస్తానికి వ్యతిరేకంగా సాగడం. అది అసాధ్యమైన లక్ష్యం. అది వీలుపడదు. కోరిక లేకపోవడమంటే అనంతంతో బాటు ఆహ్లాదంగా గడపడం, దాంతో సాగడం, అంటే సొంత కోరిక లేకపోవడం.
సొంత కోరిక లేకపోవడమంటే, సమస్తమూ ఏమి కాంక్షిస్తుందో అదే నా కాంక్ష నా వ్యక్తిగతమయిన లక్ష్యమంటూ ఏదీ లేదు అని అర్థం. మనం అస్తిత్వమంటే మనలో భాగమని వినడానికి అలవాటు పడ్డాం. మనం సముద్రపు అలలం. మనకు వ్యక్తిగత లక్ష్యాలు లేవు. ధ్యానమంటే మనకు ప్రత్యేకమయిన వునికి లేదని మనం గుర్తించడం మనం ద్వీపాలం కామని తెలుసుకోవడం. మనం అనంత ఖండంలో భాగాలం. దాన్ని దేవుడను, సత్యమను, అంతమమను, కేవలమను, నీ యిష్టమొచ్చిన పేరు పెట్టుకో!
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments