🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 293 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనిషి అపూర్వ అనుభూతి తల్లి గర్భంలో వుంది. వ్యక్తి తను పసిబిడ్డనని, ఈ అనంత విశ్వం తల్లి గర్భమని భావించాలి. ధ్యానమొక్కటే నువ్వు విశ్వ గర్భంలోకి వెళ్ళడానికి సహకరిస్తుంది. 🍀
తల్లి గర్భంలో ప్రతి బిడ్డా ఆనందంగా వుంటుంది. అక్కడ బిడ్డ ఏమీ కాడు. అమెరికా అధ్యక్షుడు కాడు. ప్రపంచంలోని గొప్ప కోటీశ్వరుడు కాడు. అతను దేన్నీ సొంతం చేసుకోడు. కానీ అతని ఆనందం అనంతం. సైకాలిజిస్టులు తల్లి గర్భంలో వున్న ఆనందాన్నే మనిషి జీవితమంతా వెతుకుతూ వుంటాడని అంటారు. మనిషి అపూర్వ అనుభూతి తల్లి గర్భంలో వుంది. ఆన్ని చెరిపెయ్యలేం. ఐతే దాన్ని మళ్ళీ మనం సులభంగా పొందవచ్చు.
వ్యక్తి తను పసిబిడ్డనని, ఈ అనంత విశ్వం తల్లి గర్భమని భావించాలి. మతం దాన్ని నొక్కి చెప్పాలి. సహకరించాలి. అప్పుడు నీకు విశ్వానికి మధ్య ఘర్షణ వుండదు. అప్పుడు నీకు ఆందోళన వుండదు. ఘర్షణ వుండదు. విశ్వం నీకు సంబంధించిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంది. నీలో హఠాత్తుగా ఆనందం మొదలవుతుంది. ధ్యానమొక్కటే నువ్వు విశ్వ గర్భంలోకి వెళ్ళడానికి సహకరిస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments