top of page
Writer's picturePrasad Bharadwaj

పరిమితులు మరియు మానసిక అవరోధాలు అధిగమించడం - 1 / Rising Above Limits and Mental Barriers - 1


🌹పరిమితులు మరియు మానసిక అవరోధాలు అధిగమించడం - 1 / Rising Above Limits and Mental Barriers - 1 🌹


ప్రసాద్ భరద్వాజ


మన జీవిత ప్రయాణంలో అడ్డంకులు మరియు మన జీవిత లక్ష్యాల వైపు మన పురోగతిని మందగించే మానసిక పరిమితుల కంటే పైకి ఎదగడం అనేది మనం శిక్షణ పొందవలసిన ముఖ్యమైన ఆధ్యాత్మిక నైపుణ్యం. పరిమితి లేదా అవరోధం అనేది మన సంకల్ప శక్తిని తగ్గించేందుకు మనమే సృష్టించుకున్న స్వీయ ఆలోచన. ఇదే జీవితంలో విజయం సాధించేందుకు అడ్డంకులు కల్పిస్తుంది. తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు (సోదరుడు లేదా సోదరి) లేదా జీవిత భాగస్వామి వంటి ప్రియమైన వ్యక్తితో మీకు సత్సంబంధం లేదని అనుకుందాం. ఇది సంబంధాన్ని చక్కగా నిర్వహించడంలో మీరు విఫలమయ్యారు అనే నమ్మకం మీ మనస్సులో ఏర్పడేలా చేస్తుంది. అన్ని సంబంధాలు దుఃఖాన్ని ఇస్తాయనే నమ్మకం ప్రతికూల అవగాహనకు దారి తీస్తుంది. ఆ అవగాహన మన చర్యలలో ప్రవహించడం ప్రారంభించి నప్పుడు మరియు మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మన నుండి సానుకూల శక్తిని పొందకపోతే, అది సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది.


అలాగే, ఒక వ్యక్తి పట్ల మన మాటలు మరియు చర్యలు వారు ఆశించినట్లుగా ఉన్నప్పుడు సైతం, ఆ వ్యక్తి మన నుండి ఎందుకు దూరం అవుతున్నాడో కొన్నిసార్లు మనకు తెలియదు? ఈ సందర్భాలలో, పైన చెప్పినట్లుగా మన మనస్సు ఒక తప్పుడు నమ్మకంతో బంధించబడి, అది అవతలి వ్యక్తి పట్ల మనకున్న అవగాహనను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. ఆ అవగాహన యొక్క శక్తి నిరంతరం అవతలి వ్యక్తికి ప్రయాణించి అతనిని లేదా ఆమెను తాకుతుంది, దీని వలన అవతలి వ్యక్తి మనం కోరుకునే దానికి భిన్నంగా మనకు ప్రతిస్పందించేలా చేస్తుంది. ఈ సందర్భాలలో మనం సృష్టించుకున్న మానసిక అడ్డంకులే కారణంగా ఉన్నాయి. మనం చేతనంగా లేదా ఉపచేతనంగా సృష్టిస్తున్న ఆలోచనల శ్రేణియే దీనికి కారణం. ఒక సంవత్సరం పాఠశాల పరీక్షలో మీరు ఘోరంగా విఫలమయ్యారు అనుకుందాం. తత్ఫలితంగా, మీరు మీ మనస్సులో మానసిక అవరోధాల శ్రేణిని ఏర్పరచుకుంటారు - మీరు అంత పదునైనవాడిని కాదని లేదా పోటీదారుని కాదని లేదా మీరు పరీక్షల సమయంలో చాలా భయానికి లోనవుతారని లేదా మీరు విజయం సాధించలేరనే మానసిక అడ్డంకులు సృష్టించుకున్నారు. అలాంటి అడ్డంకులు మన మనస్సు మరియు వ్యక్తిత్వంపై బలంగా పనిచేసే మానసిక శక్తులు. ఇది అలాంటి భవిష్యత్తు సంఘటనలపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు ఈ సందర్భంలో మరొక పాఠశాల పరీక్షను ఇవ్వడం లాంటి సందర్భాలు.


🌹 🌹 🌹 🌹 🌹




🌹Rising Above Limits and Mental Barriers - 1🌹


Rising above mental limitations, which are obstacles in our life journey and slow our progress towards our life goals, is an important spiritual skill that we need to be trained in. A limitation or a barrier is a self created thought which reduces our power of determination and power to succeed in any life sphere. Suppose I have a broken relationship with a loved one, like a parent or a sibling (brother or sister) or a life partner. This causes a belief to set inside my mind that I have been unsuccessful in handling a relationship well. The belief can result in a negative perception that all relationships are sorrow giving. When that perception then starts flowing in our actions and people whom we are close to do not receive the positive energy from us which they should, it starts affecting relationships negatively.


Also, sometimes we do not know why a particular person is distancing himself from us when our words and actions towards the person are what they are expecting? In these cases, our mind has been imprisoned by an incorrect belief like the one shared above and that has affected our perception of the other person negatively. The energy of that perception constantly travels to the other person and hits him or her which causes the other person to respond to us in a manner which is different from what we would like them to. So, the mental limit is in the background in these cases. It is a self-limiting thought or series of thoughts which we constantly create either consciously or sub-consciously. Suppose, I have fared badly in a school exam in one year. As a result, I have formed a series of mental barriers in our mind like - I am not so sharp or competitive or I am a nervous exam giver or I am not so intelligent or I cannot succeed. Such barriers are strong mental forces which are like hammers hitting on our mind and personality. This causes a negative impact on future events of the same nature, in this case the giving of another school exam.


🌹 🌹 🌹 🌹🌹

0 views0 comments

Commentaires


Post: Blog2 Post
bottom of page