top of page
Writer's picturePrasad Bharadwaj

🌹. శ్రీమద్భగవద్గీత - 209 / Bhagavad-Gita - 209 🌹




*🌹. శ్రీమద్భగవద్గీత - 209 / Bhagavad-Gita - 209 🌹* *✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద* *📚. ప్రసాద్ భరద్వాజ* *🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 05 🌴* *05. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే |* * ఏకం సాంఖ్యం చ యోగం చ య: పశ్యతి స పశ్యతి ||* 🌷. తాత్పర్యం : *సాంఖ్యము ద్వారా పొందబడు స్థానమును భక్తియోగము ద్వారాను పొందవచ్చునని ఎరిగి, తత్కారణముగా భక్తియోగము మరియు సాంఖ్యములను ఏకస్థాయిలో నున్నవానిగా గాంచువాడు యథార్థదృష్టి కలిగిన వాడగును.* 🌷. భాష్యము : జీవితపు చరమలక్ష్యమును కనుగొనుటయే తత్త్వపరిశోధనల ముఖ్యప్రయోజనమై యున్నది. జీవిత ముఖ్యలక్ష్యము ఆత్మానుభవమైనందున ఈ రెండుమార్గముల యందలి నిర్ణయములందు ఎట్టి భేదము లేదు. సాంఖ్యతత్త్వ పరిశోధన ద్వారా జీవుడు భౌతికజగత్తుయొక్క అంశ కాదనియు, పూర్ణుడైన పరమాత్ముని అంశమేననియు మనుజుడు నిర్ధారణకు వచ్చును. శుద్ధాత్మకు భౌతికజగత్తుతో సంబంధము లేదనియు మరియు దాని కర్మలన్నియును కృష్ణపరములుగా నుండవలెననియు అంతట మనుజుడు తెలిసికొనగలుగును. అట్టి భావనలో అతడు కర్మనొనరించినచో తన నిజస్థితి యందు నిలిచినవాడే కాగలడు. మొదటి పద్ధతియైన సాంఖ్యములో మనుజుడు భౌతికపదార్థము నుండి విడివడవలసియుండగా, రెండవ పద్ధతియైన భక్తియోగమునందు కృష్ణభక్తిరసభావితకర్మల యందు సంపూర్ణముగా మగ్నుడు కావలసియుండును. బాహ్యమునాకు ఒకదాని యందు అసంగత్వము ఇంకొక దాని యందు సంగత్వము గోచరించినను వాస్తవమునకు రెండు పద్ధతులు ఏకమే అయియున్నవి. భౌతికత్వము నుండి విముక్తి మరియు కృష్ణుని యెడ అనురక్తి ఏకమేననెడి విషయమును గాంచగలిగినవాడు యథార్థదృష్టిని పొందగలడు. 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Bhagavad-Gita as It is - 209 🌹* *✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada* *📚 Prasad Bharadwaj* *🌴 Chapter 5 - Karma Yoga - 05 🌴* *05. yat sāṅkhyaiḥ prāpyate sthānaṁ tad yogair api gamyate* *ekaṁ sāṅkhyaṁ ca yogaṁ ca yaḥ paśyati sa paśyati* 🌷 Translation : *One who knows that the position reached by means of analytical study can also be attained by devotional service, and who therefore sees analytical study and devotional service to be on the same level, sees things as they are.* 🌹 Purport : The real purpose of philosophical research is to find the ultimate goal of life. Since the ultimate goal of life is self-realization, there is no difference between the conclusions reached by the two processes. By Sāṅkhya philosophical research one comes to the conclusion that a living entity is not a part and parcel of the material world but of the supreme spirit whole. Consequently, the spirit soul has nothing to do with the material world; his actions must be in some relation with the Supreme. When he acts in Kṛṣṇa consciousness, he is actually in his constitutional position. In the first process, Sāṅkhya, one has to become detached from matter, and in the devotional yoga process one has to attach himself to the work of Kṛṣṇa consciousness. Factually, both processes are the same, although superficially one process appears to involve detachment and the other process appears to involve attachment. Detachment from matter and attachment to Kṛṣṇa are one and the same. One who can see this sees things as they are. 🌹 🌹 🌹 🌹 🌹 #భగవద్గీత #BhagavadGita #చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/ https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://www.tumblr.com/blog/bhagavadgitawisdom https://chaitanyavijnanam.tumblr.com/

Comments


Post: Blog2 Post
bottom of page