top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 112 / Agni Maha Purana - 112


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 112 / Agni Maha Purana - 112 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 35


🌻. పవిత్రాది వాసనము - 1🌻


అగ్నిదేవుడు చెప్పెను :- సంపాతాహుతిచేత పవిత్రలను తడిపి వాటి అధివాసనము చేయవలెను. నృసింహ మంత్రమును జపించి, వాటిని అభిమంత్రించి, అస్త్రమంత్రముచే (అస్త్రాయ ఫట్‌ ) వాటిని సురక్షితములు చేయవలెను. పవిత్రలకు వస్త్రములు చుట్టి ఉండగనే పాత్రములో ఉంచి వాటిని అభిమంత్రించవలెను. బిల్వాదిసంసృష్ట మైన జలముతో, మంత్రోచ్చారణపూర్వకముగ వాటిని ఒకటి రెండు సార్లు ప్రోక్షించవలెను.


కుంభపాత్రమునందు పవిత్రలను ఉంచి, గురువు, వాటి రక్షణనిమిత్తము, ఆ పాత్రను తూర్పున సంకర్షణమంత్రముతో దంతచాష్ఠమును, ఉసరికాయను, దక్షిణమున ప్రద్యుమ్నమంత్రముతో భస్మమును, తిలలను, పశ్చిమమున నారాయణమంత్రముతో కుశోదకమును ఉంచవలెను. పిమ్మట అగ్నేయమునందు హృదయమంత్రముతో కుంకుమమును, గోరోచనమును, ఈశాన్యదిక్కు నందు శిరోమంత్రముతో ధూపమును, నైరృతి దిక్కునందు శిఖామంత్రముతో దివ్యమూలపుష్పములను, వాయవ్యదిక్కునందు కవచమంత్రముతో చందన-జల-అక్షత-దధి-దూర్వలను దొన్నెలో ఉంచవలెను. మండపమును త్రిసూత్రముతో చుట్టి మరల అన్ని ప్రక్కల ఆవాలు చల్లవలెను.


ఏ క్రమమున దేవతల పూజ జరిగినదో ఆ క్రమముననే ఆ దేవతలకు, వారి వారి మంత్రముల నుచ్చరించుచు గంధపవిత్రము లర్పింపవలెను. ద్వారపాలాదులకు గూడ నామమంత్రములతో గంధపవిత్రము లర్పింపవలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 112 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 35


🌻 Mode of consecration of an image - 1 🌻


Agni said:


1. Having sprinkled with the residual offering one should perform consecration of the sacred, subtle, and chanted mystic formulae of the manlion. form.


2-3. Consecration of the vessels covered by the clothes should be done with mystic syllables. The vessels on which water is sprinkled once or twice with bel (leaves), should be placed near the pitcher. Having pronounced the protective spell the priest should place stick for (cleansing) the teeth and myrabolan on the east with (the recitation of syllable for) Saṅkarṣaṇa.


4. The ashes, sesamum, and cowdung-mixed earth (should be consecrated)on the south with (syllable for) Pradyumna, in the west with (that of) Aniruddha and in the north with that of Nārāyaṇa.


5. Then the waters along with the kuśa grass (should be assigned) to the south-east with the heart, the saffron and pigment on the north-east with the head, the incense on the southwest with the tuft.


6. Then the principal beautiful flowers (should be assigned) to the north-west with the armour. The sandal, water, unbroken rice, curd, and dūrvā (grass) are placed in small cups (made of leaves).


7-8. The chamber having been encircled by three threads,. the articles kept ready should be thrown again. Then in one’s. own order of adoration one should offer perfumes and (other) articles, at the foot of the gate or at the pitcher of Viṣṇu with sacred syllables. One should then worship the radiant, beautiful form of Viṣṇu capable of destroying all sins.


9. “I conceive on thy limbs, the deity who grants all coveted things”. After having worshipped him by (showing) the incense, lamp etc., one should approach the gate-way.


10. One should offer pavitra[1] along with perfumes, flowers and unbroken grains. The radiant pavitra of Viṣṇu (is capable) of destroying all sins.


11. I hold on my limbs (the pavitra) for the accomplishment of virtue, desire and worldly benefits. The pavitra is-offered to the other attendant deities and to the preceptor (seated) on a seat.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Comentarios


Post: Blog2 Post
bottom of page