top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 133 / Agni Maha Purana - 133


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 133 / Agni Maha Purana - 133 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 41


🌻. అథ శిలా విన్యాస విధి - 3🌻


''సకలభూతముల అధీశ్వరివైన ఓ భూదేవీ! పర్వతాసమనముపై విరాజిల్లుచు, సముద్రములచే చుట్చబడియున్న నీవు ఏకాంతమునందు గర్భధారణము చేయుము. వసిష్ఠకన్యవైన ఓ నందా! వసువులతోడను, ప్రజలతోడను కూడియున్న నీవు నన్ను ఆనందింపచేయుము. భార్గవ పుత్రివైన ఓ జయా! నీవు ప్రజలకు విజయము నిచ్చుదానవు. (నాకు కూడ విజయము నిమ్ము.)


అంగిరసుని పుత్రివైన ఓ పూర్ణా! నీవు నాకోరికలను తీర్పుము. కశ్యపమహర్షి పుత్రికవైన ఓభద్రా! నీవు నాకు కల్యాణమైన బుద్ధినిమ్ము. సకలబీజములతో నిండి, సమస్త రత్నౌషధుంతో సంపన్నమైన, సుందరియైన ఓ జయాదేవీ! వసిష్ఠ పుత్రికయైన ఓ నందాదేవీ! ఇచట ఆనంద పూర్వకముగ రమింపుము.


కశ్యపుని కన్యయైన ఓ భద్రా! నీవు ప్రజాపతికి పుత్రివి. నాలుగు దిక్కులందును వ్యాపించినదానవు. చాలగొప్పదానవు సుందరివి, మనోహరమైనదానవు. ఈగృహమునందు రమింపుము. ఓ భార్గవీదేవీ! నీవు చాల ఆశ్చర్యమయురాలవు. గంధమాల్యాదులతో పూడింపబడి ప్రకాశించచున్నావు. జనులకు ఐశ్వర్యమునిచ్చు ఓదేవీ! నీవీ గృహమునందు విహరింపుము. ఈదేశాధిపతికిని, నగరాధిపతికిని, గృహాధిపతికిని, దీనియందు నివసించు బాలాదులకును, మనుష్యాది ప్రాణులకును ఆనందము కలిగించుటకై పశ్వాదులను వృద్ధిపొందింపుము.'' ఈవిధముగా ప్రార్థించి వాస్తుకుండమును గోమూత్రముతో తడుపవలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 133 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 41


🌻 Mode of performing consecration - 3 🌻


21-22. The goddess earth should be worshipped in a copper vessel of the shape of a lotus. “O the exclusive mistress of all beings, abound with the summits of mountains as the seats, one surrounded by oceans, O goddess! You resort to this hole. O rejoicer! born of sage Vasiṣṭha! you rejoice with the Vasus and the progeny.


23. O Victorious! related to Bhārgava (Paraśurāma) Maker of thine subjects victorious! the perfect! the relative of Aṅgiras! fulfil all my desires.


24. O Auspicious one! related to sage Kāśyapa! Make my intellect good. One who is accomplished with all seeds! One who possesses all gems and herbs!


25. May you be victorious! O beautiful one! O rejoicer! Related to Vasiṣṭha! The daughter of the creator! O Goddess! O handsome one! Stay on here in bliss—O majestic one!


26. Stay thou in this house! O beautiful and brilliant one! the daughter of Kaśyapa! The honoured, most wonderful and bedecked with scents and garlands!


27. O Goddess! Stay in bliss in this room! O Bhār-gavi (daughter of Śukra)! Bestower of worldly prosperities! Possessed by the gods, kings, and masters of the house!


28. May you become the multiplier of animals for the happiness of men and others. Having said in this way one should then sprinkle cow’s urine on the pit.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

0 views0 comments

Comments


Post: Blog2 Post
bottom of page