top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రావణ మాసం విశిష్టత 🌹. శ్రావణ శుద్ధ పౌర్ణమి - Significance of Shravan Month 🌹 Shravan's Pournami


🙏🌹. శ్రావణ మాసం విశిష్టత 🌹🙏


🌸. శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్ధం.


🌿. ఈ నెలలో వచ్చే..._ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్ర మైనవి.


🌸. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు.

శ్రావణ నక్షత్రం విష్ణుమూర్తి జన్మనక్షత్రం కూడా...


🌷. ‘శ్రవం నయ తీతి శ్రేణ నీయత ఇతివా శ్రవణం’ వేద వాఙ్మయం🌷


🌿. హయ గ్రీవుడనే రాక్షసుడు వేదాలను అపహరిస్తే విష్ణుమూర్తి హయగ్రీవుడిగా వచ్చి వేదాలను సంరక్షించాడు. హయగ్రీవుడు అవత రించింది శ్రావణ మాసం.






🌹. శ్రావణ శుద్ధ పౌర్ణమి 🌹


🌸. జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, నాగ చతుర్థి , నాగ పంచమి పుత్రదా ఏకాదశి , దామోదర ద్వాదశి ,వరాహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి.


🌿. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనః కారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము... ఈ...మాసం...


🌸. ఈ మాస మందు రవి సంచ రించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును.


🌿. చంద్రుని చార నుంచి జరగ బోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమ మైనది.


🌸. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పు కొని మానసిక శాంతి పొంద డానికి,


🌿. ప్రకృతి వలన కలిగే అస్త వ్యస్త అనారోగ్యముల నుండి తప్పించు కొనుటకు,మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం...


🌸. శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశ మైనది.

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


29 Jul 2022

1 view0 comments

Comments


Post: Blog2 Post
bottom of page