top of page
Writer's picturePrasad Bharadwaj

శివ సూత్రములు - 11 - 4. జ్ఞానాధిష్ఠానం మాతృక - 2 / Siva Sutras - 11 - 4. Jñānādhiṣṭhānaṁ mātṛkā - 2



🌹. శివ సూత్రములు - 11 / Siva Sutras - 11 🌹


🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀


1- శాంభవోపాయ


✍️. ప్రసాద్‌ భరధ్వాజ


🌻4. జ్ఞానాధిష్ఠానం మాతృక - 2 🌻


🌴. తల్లి నుండి జ్ఞానానికి ఆధారం అక్షరాలు.🌴


ఈ పదానికి అర్థం ఏమిటంటే శబ్ద బ్రహ్మం రూపంలో ఉన్న శక్తి పరిమిత జ్ఞానానికి మూలం, పరిమితికి కారణం మూడు మలములు. "నేను పరిమితుడనై తఉన్నాను" (ఆనవ మలం), "నేను సన్నగా లేదా లావుగా ఉన్నాను" (మాయ మలం,) "నేను అగ్నిస్తోమ సమారాధకుడను" (కర్మ మలం) మూడవ సూత్రంలో చర్చించబడ్డాయి. ఈ సూత్రాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, మాతృకను అర్థం చేసుకోవడం చాలా అవసరం. మాతృకను మాతృ + కగా విభజించవచ్చు. మాతృ అంటే తల్లి మరియు కా అంటే గ్రహింపనలవికానిది(కా అంటే బ్రహ్మం అని కూడా అర్ధం). మాతృక అంటే పూర్తిగా గ్రహించలేని దివ్య తల్లి. పైన పేర్కొన్న మలాల కారణంగా ఆమెను పూర్తిగా గ్రహించలేరు.


శివుడు బ్రహ్మము మరియు అంతిమ విముక్తిని పొందడానికి శక్తి మాత్రమే ఒకరిని శివుని వైపు నడిపించగలదు. ముక్తిని పొందడానికి శక్తిని మొదట అర్థం చేసుకోవడం చాలా అవసరం. లలితా సహస్రనామం నామ 727 శివ జ్ఞాన ప్రదాయిని ఏమని చెబుతుందంటే, శక్తి ఒక్కటే శివుని గురించి జ్ఞానాన్ని ప్రసాదించి అంతిమ విముక్తికి దారితీస్తుందని. శక్తి యొక్క గతిశీలమైన స్వభావానికి విరుద్ధంగా శివుడు స్థిరంగా సాక్షీభూతంగా ఉంటాడు. మాయ యొక్క భ్రాంతికరమైన ప్రభావం కారణంగా అమ్మ సరిగ్గా గ్రహించబడదు.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 11 🌹


🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀


Part 1 - Sāmbhavopāya


✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj


🌻4. Jñānādhiṣṭhānaṁ mātṛkā - 2 🌻


🌴. The basis of knowledge from Mother is alphabets.🌴


This aphorism means that Śaktī in the form of Śabda Brahman is the source for limited knowledge, the cause of limitation being the three malas, "I am finite" (ānava mala), "I am thin or fat" (māyīya mala), and "I am an Agnistoma sacrificer" (kārma mala) discussed in the third aphorism. To understand this sūtrā better, understanding Mātṛkā is essential. Mātṛkā can be split into mātṛ + ka. Mātṛ means mother and ka means un-comprehended (ka also means the Brahman). Mātṛkā means that the Divine mother, who is not fully comprehended. She is not fully comprehended because of the malas referred above.


Shiva is the Brahman and only Śaktī can lead one to Shiva to attain the final liberation. It becomes essential that Śaktī should be first understood to attain liberation. Lalithā Sahasranāmam nāmā 727 śiva jnāna pradāyinī says, that Śaktī alone can lead to knowledge about Shiva for final liberation. Shiva is static and witnessing as opposed to the kinetic nature of Śaktī, who is the universal dynamic energy. Mostly She is not comprehended properly due to the illusionary effect of māyā.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Comments


Post: Blog2 Post
bottom of page