🌺 హృదయ శుద్ధి ముఖ్యం. స్మరణయే మార్గం 🌺
🌴. పరమాత్మ యొక్క శక్తి ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉంది. ఆయన అనుగ్రహం కోసం ఎక్కడో వెదకవల్సిన పనిలేదు. ప్రకాశించే సూర్యుడు అయినా తన సొంత కాంతితో మాత్రమే చూడగలడు. అలాగే భగవంతుని అనుగ్రహం వల్ల మాత్రమే మనకు భగవంతుని దర్శనం లభిస్తుంది. దైవాన్ని అనుభవించడానికి నైపుణ్యం, పాండిత్యం అవసరం లేదు. హృదయాన్ని నిర్మలంగా ఉంచుకుంటే చాలు. మేఘాలు సూర్యుడిని కనిపించనీయకుండా చేసినట్లే, అహంభావం, అనుబంధం, ద్వేషం అనే మేఘాలు మనల్ని దైవాన్ని చూడకుండా అడ్డుకుంటున్నాయి. వీటిని సరైన సాధన ద్వారా తొలగించుకోవాలి. ఈ మేఘాలను చెదరగొట్టాలంటే భగవన్నామ స్మరణయే సరైన సాధనము. సాధన అనేది దైవాన్ని చేరుకోవడానికి రాజమార్గం. మానవ జీవితం అనేది మంచి మరియు చెడు లక్షణాల మిశ్రమం. మంచి లక్షణాలు ఎక్కువగా ఉన్న వ్యక్తి ఇతరులలో మంచిని మాత్రమే చూస్తాడు. సమదృష్టి ఉన్నవారు మంచి చెడులను నిష్పక్షపాతంగా చూస్తారు. కాబట్టి మంచి లక్షణాలను పెంపొందించుకోవడం అవసరం. హృదయశుద్దే అన్నింటికన్నా ముఖ్యమైనది. రోజుకు పదిసార్లు సబ్బుతో ముఖం రుద్దితే సరిపోదు, హృదయ మాలిన్యం కూడా తొలగించుకోవాలి. 🌴
Comentarios