🌹01, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
🍀. భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి శుభాకాంక్షలు, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti Good Wishes to All 🍀
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : భీష్మ - జయ ఏకాదశి, విష్ణు సహస్రనామ జయంతి, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti 🌺
🍀. శ్రీ గణేశ హృదయం - 5 🍀
8. వినాయకం నాయకవర్జితం ప్రియే
విశేషతో నాయకమీశ్వరాత్మనామ్ |
నిరంకుశం తం ప్రణమామి సర్వదం
సదాత్మకం భావయుతేన చేతసా
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : పురుష ప్రకృతులు సత్యవస్తువు యొక్క వేర్వేరు శక్తులు. అనగా, నైష్కర్మ స్థితియే పురుషుడనీ, కర్మ ప్రవృత్తియే ప్రకృతియనీ, నైష్కర్మ్య స్థితి యందు ప్రకృతి లేదనీ, కర్మప్రవృత్తి యందు పురుషుడు లేడనీ భావింపరాదు. సంపూర్ణమైన కర్మప్రవృత్తిలో కూడ పురుషుడు మరుగున దాగియే యున్నాడు. అట్లే సంపూర్ణమైన నైష్కర్మ్యస్థితిలో కూడ ప్రకృతి విశ్రాంత రూపిణిగ నిలిచియే యున్నది. 🍀
🌹. భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి 🌹
కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేలకొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణంకోసం వేచి ఉన్నాడు. తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు. 58 రోజులు అంపశయ్యపై పవళించి మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదించాడు. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని ''భీష్మ ఏకాదశి'', ''మహాఫల ఏకాదశి'', ''జయ ఏకాదశి'' అని అంటారు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామ స్తోత్రము.
నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా
వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం
''శ్రీమన్నారాయణుని పాదకమలాలకు నమస్కారం. దేవదేవుని నిరంతరం పూజిస్తూ, ఆ పవిత్ర నామాన్ని జపిస్తూ, నిర్మలమైన మనసుతో, అవ్యయమైన ఆయన తత్వాన్ని స్మరిస్తున్నాను''.
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 14:03:47 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: మృగశిర 27:24:48 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: ఇంద్ర 11:29:39 వరకు
తదుపరి వైధృతి
కరణం: విష్టి 14:03:47 వరకు
వర్జ్యం: 06:54:16 - 08:41:12
దుర్ముహూర్తం: 12:06:50 - 12:52:23
రాహు కాలం: 12:29:36 - 13:55:00
గుళిక కాలం: 11:04:13 - 12:29:36
యమ గండం: 08:13:26 - 09:38:49
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51
అమృత కాలం: 17:35:52 - 19:22:48
సూర్యోదయం: 06:48:02
సూర్యాస్తమయం: 18:11:10
చంద్రోదయం: 14:29:38
చంద్రాస్తమయం: 03:17:53
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: అమృత యోగం - కార్య
సిధ్ది 27:24:48 వరకు తదుపరి
ముసల యోగం - దుఃఖం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments