top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 04, JUNE 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

Updated: Jun 4, 2023

🍀🌹 04, JUNE 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 04, JUNE 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

*🍀. జ్యేష్ఠ ఏరువాక పూర్ణిమ, కబీరుదాసు జయంతి శుభాకాంక్షలు, Jyeshtha Eruvaka Purnima, Kabirdas Jayanti Good Wishes to All. 🍀*

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 380 / Bhagavad-Gita - 380 🌹

🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 08 / Chapter 10 - Vibhuti Yoga - 08 🌴

4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 227 / Agni Maha Purana - 227 🌹

🌻. దేవ సముదాయ సాధారణ ప్రతిష్ఠా కథనము. - 3 / Mode of consecration of other gods (sādhāraṇa-pratiṣṭhā) - 3 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 092 / DAILY WISDOM - 092 🌹

🌻 1. మానవత్వానికి ఆదర్శం ఆధ్యాత్మికం / 1. The Ideal of Humanity is Spiritual🌻

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 358 🌹

6) 🌹. శివ సూత్రములు - 94 / Siva Sutras - 94 🌹

🌻 2-06. గురు రూపాయః - 1 / 2-06. guru Rupāyah - 1 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 04, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*

*🍀. జ్యేష్ఠ ఏరువాక పూర్ణిమ, కబీరుదాసు జయంతి శుభాకాంక్షలు, Jyeshtha Eruvaka Purnima, Kabirdas Jayanti Good Wishes to All. 🍀*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : జ్యేష్ఠ ఏరువాక పూర్ణిమ, కబీరుదాసు జయంతి, Jyeshtha Eruvaka Purnima, Kabirdas Jayanti 🌻*


*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 9 🍀*


*17. ఆలోకకృల్లోకనాథో లోకాలోకనమస్కృతః | కాలః కల్పాంతకో వహ్నిస్తపనః సంప్రతాపనః*

*18. విలోచనో విరూపాక్షః సహస్రాక్షః పురందరః | సహస్ర రశ్మిర్మిహిరో వివిధాంబరభూషణః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ఛాయాచిత్రం - ఛాయాచిత్రం ఒక సాధను మాత్రమే, సరియైన దృష్టి నీకుంటే, ఆ ఛాయాచిత్రం ద్వారా దానికి మూలమైన సచేతనుని గుర్తెరిగి తత్సంబంధ సాధనంగా దానిని ఉపయోగించు కొనగలవు. ఇది ఒక విధంగా దేవాలయంలోని విగ్రహానికి చేసే ప్రాణప్రతిష్ట వంటిది. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

జ్యేష్ఠ మాసం

తిథి: పూర్ణిమ 09:12:47 వరకు

తదుపరి కృష్ణ పాడ్యమి

నక్షత్రం: జ్యేష్ఠ 27:23:49 వరకు

తదుపరి మూల

యోగం: సిధ్ధ 11:59:47 వరకు

తదుపరి సద్య

కరణం: బవ 09:09:48 వరకు

వర్జ్యం: 10:16:26 - 11:45:42

దుర్ముహూర్తం: 17:02:58 - 17:55:26

రాహు కాలం: 17:09:31 - 18:47:55

గుళిక కాలం: 15:31:08 - 17:09:31

యమ గండం: 12:14:22 - 13:52:45

అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:40

అమృత కాలం: 19:12:02 - 20:41:18

సూర్యోదయం: 05:40:49

సూర్యాస్తమయం: 18:47:55

చంద్రోదయం: 19:14:04

చంద్రాస్తమయం: 05:28:56

సూర్య సంచార రాశి: వృషభం

చంద్ర సంచార రాశి: వృశ్చికం

యోగాలు: కాల యోగం - అవమానం

27:23:49 వరకు తదుపరి సిద్ది యోగం

- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🍀🌹. జ్యేష్ఠ ఏరువాక పూర్ణిమ, కబీరుదాసు జయంతి శుభాకాంక్షలు, Jyeshtha Eruvaka Purnima, Kabirdas Jayanti Good Wishes to All. 🌹🍀*

*ప్రసాద్‌ భరధ్వాజ*


*భగవంతుని కొరకు అక్కడ - ఇక్కడ వెతకవలసిన పనిలేదు, అతడు నీలోనే ఉన్నాడు . నీలో వున్న ఆత్మారాముని కనుగొనలేక కస్తూరి మృగం చందంబున అక్కడక్కడ వెదకులాడిన ఏమి లాభం? పూవులోని వాసనలా దేవుడు నీలోనే ఉన్నాడు. తన నాభి

నుండి బయట పడుతున్న కస్తూరి గంధాన్ని, తెలుసుకొనలేని జింక, దాన్నిబయట గడ్డిలో వెతుకుతుంది. అలాగే నీలోని భగవంతుని బయట వెతకవద్దు. - మహాత్మా శ్రీ కబీరుదాసు.*


*🌻. కబీరుదాసు జీవిత విశేషాలు :*

*భక్తి ఉద్యమకారుడుగా, సామాజిక సంస్కర్తగా, సమతా ఉద్యమకారునిగా ప్రజాకవిగా సంత్‌ కబీర్‌దాస్‌ పేరు పొందాడు. కాశీ కేంద్రంగా క్రీ.శ.1455-1518 మధ్య వారు జీవించారు. వారు జేష్ఠ పౌర్ణమి నాడు జన్మించారు. వారి జీవనానికి సంబంధించి అనేక వైరుధ్య కథనాలు వినపడు తున్నాయి. వారి జీవన కాలం విదేశీ ముస్లిం పాలకుల దౌర్జన్యం తీవ్రంగా ఉన్న సమయం. సమాజంలో దురాచారాలకూ కొదవలేదు. విదేశీ పాలకుల దుర్మార్గం ముందు సమాజం నిలబడలేని నిస్సహాయ స్థితిలో ఆ కాలంలో దేశం నలుమూలలా భక్తి ఉద్యమం ఉద్భవించింది. ఆ రోజుల్లో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా భక్తి ఉద్యమాన్ని అందివ్వడంతో పాటు, ఆడంబరాలు, మూఢాచారాలు, పటాటోపాలకు దూరంగా సంస్కరణలను, సామాజిక సమతా ఫలాలను అందించిన మహాకవి సంత్‌ కబీర్‌దాస్‌.*


*సమతామూర్తి శ్రీరామానుజుల శిష్యుడు రామానందుడు. రామానందునికి ఉత్తర భారతంలో అనేక కులాల్లో అనేక మంది శిష్యులున్నారు. వారిలో కాశీకి చెందిన కబీర్‌దాస్‌, రవిదాస్‌ ప్రముఖులు. వీరిద్దరూ సమకాలీనులు.*


*తల్లి తండ్రులకు దూరమై అనాథగా ఉన్న శిశువును చేనేత వృత్తిలో ఉన్న ముస్లిం దంపతులు నీరు, నీమా పెంచి పెద్దచేశారు. కబీర్‌దాస్‌పై ముస్లిం, హిందూ సమాజాల రెండింటి ప్రభావం ఉంది. కబీర్‌ పెద్ద చదువులకు నోచుకోలేదు. చిన్ననాటి నుండే ఆయనలో ఆధ్యాత్మిక పిపాస పెంపొందింది. తెల్లవారు ఝామునే చీకట్లో గంగాస్నానం చేసి వస్తున్న రామానందుని కాళ్ళకు మెట్ల మధ్య కబీర్‌దాస్‌ దేహం తగిలింది. ‘రామ రామ’ రామానందుని నోటి నుండి వెలువడ్డ వాక్యాలే కబీర్‌దాస్‌కు ‘మంత్రోపదేశ’ మయింది.*


*కబీర్‌దాస్‌కు చిన్ననాటనే అనేక అద్భుతాలు కనబడ్డాయి. ఆకలిగా ఉన్న శిశు కబీర్‌కు ఆవులు స్వయంగా తమ పొదుగుల నుండి పాలను అందిచ్చేవట! తోటి బాలురకంటె భిన్నంగా కబీర్‌ జీవించాడు. చేనేత అతని కుటుంబ వృత్తి. ఆశువుగా కవిత్వం చెప్పేవాడు. కబీర్‌ ఆనాటి హిందూ, ముస్లిం, సిఖ్‌ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాడు. ఎప్పుడూ సంపాదన కోసం తాపత్రయ పడలేదు.*


*కులము, మతము, పాండిత్యాలకు అతీతంగా అందరికీ అందుబాటులోకి భగవంతుణ్ణి తీసుకురావడం కబీర్‌దాస్‌ ప్రధాన జీవన లక్ష్యం. ఆడంబరాలు, పూజా పద్ధతులు, పాండిత్యాలు వంటివాటికి దూరంగా భక్తి భావంతో భగవంతునికి సమర్పించుకోవడం ఏకైక మార్గంగా కబీర్‌దాస్‌ జీవించాడు. పురాణపురుషులైన హనుమంతుడు, వశిష్ఠుడు, చారిత్రిక పురుషులైన గోరఖ్‌నాధ్‌, మక్దూమ్‌ జహారియా వంటి మహాపురుషుల దర్శనం పొంది వారితో ఆధ్యాత్మిక చర్చలు చేసినవాడు. కబీర్‌దాస్‌ మానవతావాది, అహింసావాది, సామాజిక సంస్కర్త, నిరాడంబర జీవనం, అత్యంత పరిమిత కోరికలు, అపరిగ్రహత, భగవత్‌ సమర్పిత జీవనం – ఇలా అనేక విశేషాలు వారి జీవనంలో దర్శనమిస్తాయి.*


*కబీర్‌దాస్‌ రచించిన 225 గీతాలు, 250 సఖిలు (రెండు పంక్తుల పద్యాలు) సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘ఆదిగ్రంధసాహెబ్‌’ లో చేర్చబడ్డాయి. కబీర్‌దాస్‌ రచించిన అన్ని రచనలు కలిపి ‘బీజక్‌’ అనే గ్రంధరూపంగా సంకలనం అయ్యాయి. ‘కబీర్‌ గ్రంధావళి’, ‘కబీర్‌ వచనావళి’ పేరుతో 1930లో గ్రంథాలుగా వెలువడ్డాయి. కబీర్‌దాస్‌ చెప్పిన, ఎంపిక చేసిన 100 గేయాలను రవీంద్రుడు అనువాదం చేశారు. కబీర్‌దాస్‌ సాహిత్యం విదేశీ భాషల్లో సైతం అనువాదమయింది.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 380 / Bhagavad-Gita - 380 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 08 🌴*


*08. అహం సర్వస్య ప్రభవో మత్త: సర్వం ప్రవర్తతే |*

*ఇతి మత్వా భజన్తే మాం బుధా భావసమన్వితా: ||*


🌷. తాత్పర్యం :

*నేనే సర్వములైన ఆధ్యాత్మిక, భౌతిక జగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపుర్వకముగా అర్చింతురు.*


🌷. భాష్యము :

*వేదములను సంపూర్ణముగా అధ్యయనము చేసినవాడును మరియు శ్రీచైతన్యమహాప్రభువు వంటి ప్రామాణికుల ద్వారా జ్ఞానమును పొంది, ఆ ఉపదేశములను ఏ విధముగా ఆచరణలో పెట్టవలెనో ఎరిగినవాడు అగు పండితుడు శ్రీకృష్ణుడే భౌతిక, ఆధ్యాత్మికజగత్తుల యందలి సర్వమునకు మూలమని అవగాహన చేసికొనగలడు. ఈ విషయమును పూర్ణముగా నెరిగియుండుటచే అతడు అ భగవానుని భక్తియుతసేవలో స్థిరముగా నుమగ్నుడగును. అర్థరహిత వ్యాఖ్యానములచే గాని, మూర్ఖులచేగాని ప్రభావితుడు గాక ఆ భక్తుడు తన భక్తిమార్గము నుండి వైదొలగకుండును. శ్రీకృష్ణుడే బ్రహ్మ, శివుడు మరియు ఇతర దేవతలందరికీ మూలమని వేదవాజ్మయము ఆంగీకరించుచున్నది. “యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ గాపయతి స్మ కృష్ణ: “ యని అథర్వణవేదము నందలి గోపాలతాపన్యుపనిషత్తు (1.24) నందు తెలుపబడినది.*


*అనగా ఆదిలో బ్రహ్మదేవునకు వేదజ్ఞాన మొసగిన వాడును మరియు పూర్వము వేదజ్ఞానమును విస్తరింపజేసిన వాడును శ్రీకృష్ణుడే. అదే విధముగా నారాయణోపనిషత్తు (1) నందు కూడా “అప్పుడు దేవదేవుడైన నారాయణుడు జీవులను సృజించదలచెను” అని తెలుపబడినది (అథ పురుషో హ వై నారాయణో(కామయత ప్రజా: సృజేయేతి). అదే ఉపనిషత్తు ఇంకను కొనసాగి “నారాయణాద్ బ్రహ్మా జాయతే, నారాయణాద్ ప్రజాపతి:ప్రజాయతే, నారాయణాద్ ఇంద్రోజాయతే, నారాయణాదష్టౌవసవో జాయన్తే, నారాయణాద్ ఏకాదశ రుద్రా జాయన్తే, నారాయణాద్ ద్వాదశాదిత్యా:” యనియు తెలిపినది. అనగా నారాయణుని నుండియే బ్రహ్మదేవుడు మరియు ప్రజాపతులు ఉద్భవించిరి. నారాయణుని నుండియే ఇంద్రుడు జన్మించెను. నారాయణుని నుండియే అష్టవసువులు జన్మించిరి. నారాయణుని నుండియే ఏకాదశ రుద్రులు ఉద్భవించిరి మరియు నారాయణుని నుండియే ద్వాదశాధిత్యులును జన్మించిరి. అట్టి నారాయణుడు శ్రీకృష్ణభగవానుని ఒక ప్రధాన విస్తృతాంశము.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 380 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 10 - Vibhuti Yoga - 08 🌴*


*08. ahaṁ sarvasya prabhavo mattaḥ sarvaṁ pravartate*

*iti matvā bhajante māṁ budhā bhāva-samanvitāḥ*


🌷 Translation :

*I am the source of all spiritual and material worlds. Everything emanates from Me. The wise who perfectly know this engage in My devotional service and worship Me with all their hearts.*


🌹 Purport :

*A learned scholar who has studied the Vedas perfectly and has information from authorities like Lord Caitanya and who knows how to apply these teachings can understand that Kṛṣṇa is the origin of everything in both the material and spiritual worlds, and because he knows this perfectly he becomes firmly fixed in the devotional service of the Supreme Lord. He can never be deviated by any amount of nonsensical commentaries or by fools. All Vedic literature agrees that Kṛṣṇa is the source of Brahmā, Śiva and all other demigods. In the Atharva Veda (Gopāla-tāpanī Upaniṣad 1.24) it is said, yo brahmāṇaṁ vidadhāti pūrvaṁ yo vai vedāṁś ca gāpayati sma kṛṣṇaḥ: “It was Kṛṣṇa who in the beginning instructed Brahmā in Vedic knowledge and who disseminated Vedic knowledge in the past.”*


*Then again the Nārāyaṇa Upaniṣad (1) says, atha puruṣo ha vai nārāyaṇo ’kāmayata prajāḥ sṛjeyeti: “Then the Supreme Personality Nārāyaṇa desired to create living entities.” The Upaniṣad continues, nārāyaṇād brahmā jāyate, nārāyaṇād prajāpatiḥ prajāyate, nārāyaṇād indro jāyate, nārāyaṇād aṣṭau vasavo jāyante, nārāyaṇād ekādaśa rudrā jāyante, nārāyaṇād dvādaśādityāḥ: “From Nārāyaṇa, Brahmā is born, and from Nārāyaṇa the patriarchs are also born. From Nārāyaṇa, Indra is born, from Nārāyaṇa the eight Vasus are born, from Nārāyaṇa the eleven Rudras are born, from Nārāyaṇa the twelve Ādityas are born.” This Nārāyaṇa is an expansion of Kṛṣṇa.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 227 / Agni Maha Purana - 227 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 66*


*🌻. దేవ సముదాయ సాధారణ ప్రతిష్ఠా కథనము. - 3 🌻*


*పిదప శేషహోమము చేసి మూడు పూర్ణాహుతులు ఇవ్వవలెను. ''యుజ్ఞతే'' ఇత్యాద్యనువాకమును చదువుచు, ప్రణవముతో రావి ఆకుల విస్తరులో వడ్డించుకొని ఛరువును భక్షించవలెన. పిమ్మట మాసాధిపతుల నుద్దేశించి పండ్రెండుగురు బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. ఆచార్యుడు వారిలో పదమూడవవాడుగా ఉండవలెను. వారికి మధుర జలపూర్ణములగు పదమూడు కలశముల, ఉత్తమమైన ఛత్రము పాదుకలు. వస్త్రములు, సువర్ణము, మాలలు దానము చేయవలెను.*


*వ్రతపూర్తికి అన్ని వస్తువులు పదమూడు చొప్పున చేయవలెను. ''గోవులు ప్రసన్నములుగాక, సంతోషముతో నవిచరించుగాక, అని పలుకుచు గోపథమును (గోవులు మేయుటకు స్థానము) విడచిపదిహస్తముల ఎత్తైన యూపస్తంభము పాతవలెను. గృహస్థుడు ఇంటిలో హోమాదికార్యములన్నియు యథాశాస్త్రముగ జరిపి, పూర్వోక్త విధ్యనుసారము గృహములో ప్రవేశించవలెను. అందరికిని, ఏ అడ్డులును లేకుండ అన్నదానము చేయవలెను. బ్రాహ్మణులకు యథాశక్తిగ దక్షిణ లీయవలెను. ఉద్యానమును నిర్మించువాడు చిరకాలము నందనోద్యానములో నివసించును. మఠ ప్రదానము చేయుటచే స్వర్గలోక ఇంద్ర లోకములు ప్రాప్తించును ప్రపా (చలివెందలి) దానము చేసినవాడు వరుణలోకమునందును., సేతునిర్మాణము చేసినవాడు దేవలోకమునందును నివసించును. ఇటుకలతో సేతవు నిర్మించువాడు కూడ స్వర్గము పొందును. గోపథమును నిర్మించు వాడు గోలోకము పొందును. నియములను వ్రతములను ఆచరించువాడు సాక్షాద్విష్ణు స్వరూపుడగును కృచ్ఛ్రవ్రతములు చేయువాడు సమస్తపాపములను నశింపచేసికొనును గృహదానము చేసినవాడు మహాప్రలయము వరకును స్వర్గములో నివసించును. గృహస్థుడు శివాదిదేవతల సముదాయ ప్రతిష్ఠ చేయవలెను.*


*శ్రీ అగ్నిమహాపురాణనందు సాధారణ ప్రతిష్ఠాకథనమను అరువది యారవ అధ్యాయము సమాప్తము.*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 227 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 66*

*🌻Mode of consecration of other gods (sādhāraṇa-pratiṣṭhā) - 3 🌻*


21. Having repeated the hymn yuñjate[11] the gruel should be partaken. With the praṇava (syllable oṃ) repeated at the end of the respective name the gruel should be placed in a vessel made of holy fig tree.


22. Then twelve brahmins (representing) the twelve presiding deities of the months should be fed. The priest (would be) the thirteenth. The thirteenth place should be offered to him.


23. Thirteen pitchers containing sweet water along with umbrellas, shoes, clothes, gold and garlands should be given to them for the sake of conclusion of the rite.


24. A path-way should be laid out (for the cattle) saying, “May the cows get pleased! May they move happily!” Then the sacrificial post should be planted there.


25-26. A water-shed in the pleasure grove, monastery and path-way should be of ten cubits. Having done the oblation etc. in the house duly in the prescribed way, the householder should enter the house according to the earlier injunctions. Offering of food etc. without any restrictions should be made on all these (occasions).


27. Fees should be paid by wise men to the brahmins according to one’s capacity. Whoever causes to set up a pleasure grove stays eternally in the garden of Indra.


28. One who builds a monastery goes to heaven and remains in the world of Indra. One who sets up a water-shed (lives) with Lord Varuṇa. By (the construction of) a pathway one remains in the heaven.


29. One who builds a bridge of bricks and who constructs a pathway for cows in the cattle stall and one who observes the austerities in the prescribed way dwells in the region of Viṣṇu. One who performs atonements gets rid of all sins.


30. Having constructed a house (for the god) one dwells in heaven so long as the universe exists. The installation and consecration of Lord Śiva etc., the lords of their edifices (have been described).


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 92 / DAILY WISDOM - 92 🌹*

*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 1. మానవత్వానికి ఆదర్శం ఆధ్యాత్మికం 🌻*


*మానవాళికి ఆదర్శం ఆధ్యాత్మికం. ఈ విషయాన్ని పరిశీలనాత్మకమైన ఏ మనస్సైనా గ్రహిస్తుంది. అన్ని ఆచరణాత్మక పరిశీలనలకు విరుద్ధంగా కనిపించినప్పటికీ, జీవితంలోని భౌతికవాద విధానాలలో కదలికలు కూడా, నిజంగా ఆధ్యాత్మిక భావాన్ని కోల్పోవు. ఇది మనం జీవితం పట్ల వైఖరుల వెనుక ఉన్న ప్రేరణ శక్తులను మానసికంగా గమనించినట్లయితే అర్థమౌతుంది. అత్యంత నీచమైన మనుషుల్లో కూడా ఒక ఆధ్యాత్మిక మూలకం దాగి ఉంటుంది. మానవాళిలో మనం అనేక వృత్తాలలో గమనించే దుర్మార్గపు కదలికలు కొన్నిసార్లు మనకి, సర్వవ్యాపిగా భావించబడే ఆత్మ ఇటువంటి నేరాల వెనుక ప్రేరణగా ఉంటుందా అని అనిపించే అయోమయంలో పడేస్తాయి.*


*దాని సమాధానం అవును. అతి అల్పమైన సంఘటనలు కూడా ఒక రహస్య ఉద్దేశ్యం కలిగి ఉంటాయి. అయితే బయట కనిపించకపోయినా రహస్యంగా ఉన్న ఉద్దేశం. ఎటువంటి సంఘటనకు సంబంధించి మూల ఉద్దేశమైనా తాను ఎదగాలనుకుంటున్న చైతన్యాన్ని సాధించడమే అయి ఉంటుంది. కానీ అది జీవితపు తుఫానులో మంచిగానైనా చేదుగానైనా పరిణమించవచ్చు. మానవజాతి యొక్క తప్పులు నిజంగా అజ్ఞానం వల్ల జరిగినవి. సత్యం యొక్క అజ్ఞానం ఆ సత్యాన్ని తిరస్కరించడంతో సమానం కాదు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 92 🌹*

*🍀 📖 The Ascent of the Spirit 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 1. The Ideal of Humanity is Spiritual 🌻*


*The ideal of humanity is spiritual. This is a thesis which cannot be set aside by any observant mind. Even where it appears to be the opposite for all practical observations, even in crass materialistic approaches of life, the movements are not really bereft of the spiritual sense, if we are to be psychoanalytically observant of the motive forces behind attitudes to life. Even the worst of men have a spiritual element hiddenly present, and the vicious movements which we observe in humanity in many a circle may sometimes confound us into a doubt as to whether the Spirit which is held to be omnipresent can be the motive force behind these perpetrations.*


*Yes, is the answer. Even the least of events has a hidden purpose and motive, though not visible outside but covertly present—the motive which rightly or wrongly, by various types of meanderings in the desert of life, directs itself towards awakening into the consciousness of what it is really seeking. The errors of mankind are really the products of ignorance, and an ignorance of a fact cannot be equated with a denial of that fact.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 357 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. మనసు అరుస్తుంది. ఆ అరుపుకు ఫలితముండదు. హృదయం శబ్దం చెయ్యదు. ఆ నిశ్శబ్దం నిర్ణయాన్నిస్తుంది. మనసు నించీ హృదయానికి , వాదన నించి ఆమోదానికి దిగితే జీవితం హఠాత్తుగా మారిపోతుంది. 🍀*


*మనసు వాదించేది. అనంతవాదోపవాదాల్లో మునిగి వుంటుంది. అదెప్పుడూ మేలుకునే వుంటుంది. బిజీగా వుంటుంది. నీకు ఎట్లాంటి అంతిమ నిర్ణయాన్ని అందివ్వదు. ముగింపునివ్వదు. అది ముగింపు లేనిది. అది దాని& తత్వం. కాబట్టి తత్వశాస్త్రం మానవజాతికి ఎట్లాంటి పరిష్కారాన్నీ యివ్వలేకపోయింది. అది నిష్పలమైన వ్యాయామం. వేలమంది తెలివైన వాళ్ళు ఆ పనికి మాలిన పనిలో మునిగి తేలారు. మనసు వాదిస్తుంది. కానీ ఎట్లాంటి పరిష్కారానికీ రాదు.*


*హృదయం ఎట్లాంటి వాదోపవాదననీ చెయ్యదు. దానికి పరిష్కారం తెలుసు. అదే విషయం. జీవితంలోని ఒకానొక రహస్యమది. మనసు అరుస్తుంది. ఆ అరుపుకు ఫలితముండదు. హృదయం శబ్దం చెయ్యదు. ఆ నిశ్శబ్దం నిర్ణయాన్నిస్తుంది. మనసు నించీ హృదయానికి వాదన నించి ఆమోదానికి దిగితే జీవితం హఠాత్తుగా మారిపోతుంది. ఆ మార్పులో అర్థం, అందం, పరిమళం వుంటాయి. కాంతి ప్రేమ వుంటాయి. వాటన్నిటి కలయికే దైవత్వం.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 094 / Siva Sutras - 094 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*2వ భాగం - శక్తోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 2-06. గురు రూపాయః - 1 🌻*

*🌴. మనస్సు మరియు శరీరం యొక్క మలినాలను అధిగమించడానికి, మాతృకలలో నివసించే మంత్ర శక్తులను మేల్కొల్పడానికి మరియు స్వయం యొక్క స్వచ్ఛమైన ఎరుకను పొందడానికి గురువే సాధనం. 🌴*


*గురువు – ఆధ్యాత్మిక గురువు; ఉపాయః - ఉపయోగకరము. ఆధ్యాత్మిక గురువు మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానానికి దారితీయగలడు. గురువు భావనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గురువు తన శిష్యుడిని ఆత్మసాక్షాత్కారానికి నడిపించేవాడు. గురువుకు ఉన్న ఏకైక ప్రమాణం అతను స్వీయ-సాక్షాత్కారమైన వ్యక్తిగా ఉండాలి. కేవలం సైద్ధాంతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి గురువు కాలేడు. నిజమైన గురువు అతనిలో ఈ క్రింది లక్షణాలను సమీకరించుకుంటారు; స్వీయ నియంత్రణ, నిరాడంబరత, స్వచ్ఛత, సహనం, నిజాయితీ, వివేకం, జ్ఞానం మరియు విశ్వాసం. కేవలం సిద్ధాంతం మాత్రమే ఆధ్యాత్మికతకు సహాయం చేయదు. సైద్ధాంతిక అంశాలు ఉపనిషత్తులలో సమగ్రంగా చర్చించబడిన పునాదులను ఏర్పరుస్తాయి.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 094 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 2 - Śāktopāya.

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 2-06. guru rupāyah - 1 🌻*

*🌴. The guru is the means to overcome the impurities of the mind and body, awaken the mantra shaktis who reside in the matrkas and attain the pure consciousness of the self. 🌴*


*Guru – the spiritual teacher; upāyaḥ - expedient. Only a spiritual master can lead to spiritual enlightenment. Understanding the concept of guru is very important. Guru is the one, who leads his disciple to Self-realization. The only criterion for a guru is that he should be a Self-realised person. A person with only theoretical knowledge cannot be a guru. A true guru will have the following qualities assimilated in him; self-control, austerity, purity, forbearance, uprightness, knowledge, wisdom and faith. Mere theory alone does not help in spirituality. Theoretical aspects form the foundations that are deliberated exhaustively in Upaniṣads.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page