top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 19, FEBRUARY 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

Updated: Feb 19, 2023

🍀🌹 19, FEBRUARY 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 19, FEBRUARY 2023 SUNDAY, ఆదివారం, భాను వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹 కపిల గీత - 136 / Kapila Gita - 136 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 20 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 20 🌴

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 728 / Vishnu Sahasranama Contemplation - 728 🌹

🌻728. కః, कः, Kaḥ🌻

4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 689 / Sri Siva Maha Purana - 689 🌹 *🌻. శివ స్తుతి - 2 / The Prayer of the gods - 2 🌻*

5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 310 / Osho Daily Meditations - 310 🌹 🍀 310. సంధ్యా సమయం / 310. TWILIGHT 🍀

6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 434-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 434-2 🌹 🌻 434. 'కుశలా' -2 / 434. 'Kushala' -2 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 19, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*


*🍀. సూర్య మండల స్త్రోత్రం - 9 🍀*


9. యన్మండలం విష్ణు చతుర్ముఖాఖ్యం |

యదక్షరం పాపహరం జనానామ్ |

యత్కాలకల్పక్షయ కారణం చ |

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : అంతశ్చైతన్య మందు విషయ నివేదన మొనర్చి జవాబు నాలకించడ మనేది రూపకాలంకారంగా చెప్పిన మాటయే కాని వేరుకాదు. జవాబు వాగ్రూపంలోనే ఉంటుందన్న నియమం లేదు. ఏ రూపంలోనైనా ఉండ వచ్చును. జవాబు సరియైనదేనని తేల్చుకోడం సులభమైన విషయం కాదు. అంతరంగంలో సద్గురుని చైతన్యంతో సాంగత్యం యిట్టి సందర్భంలో చాల అవసరం.🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, మాఘ మాసం

తిథి:కృష్ణ చతుర్దశి 16:19:06 వరకు

తదుపరి అమావాశ్య

నక్షత్రం: శ్రవణ 14:44:10 వరకు

తదుపరి ధనిష్ట

యోగం: వరియాన 15:20:18

వరకు తదుపరి పరిఘ

కరణం: శకుని 16:19:06 వరకు

వర్జ్యం: 18:14:30 - 19:38:42

దుర్ముహూర్తం: 16:46:02 - 17:32:35

రాహు కాలం: 16:51:51 - 18:19:09

గుళిక కాలం: 15:24:33 - 16:51:51

యమ గండం: 12:29:58 - 13:57:16

అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52

అమృత కాలం: 05:37:34 - 07:01:38

మరియు 26:39:42 - 28:03:54

సూర్యోదయం: 06:40:48

సూర్యాస్తమయం: 18:19:09

చంద్రోదయం: 05:54:36

చంద్రాస్తమయం: 17:25:55

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: మకరం

యోగాలు: గద యోగం - కార్య హాని,

చెడు 14:44:10 వరకు తదుపరి

మతంగ యోగం - అశ్వ లాభం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. కపిల గీత - 137 / Kapila Gita - 137 🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 21 🌴*


*21. శ్రీభగవానువాచ*

*అనిమిత్తనిమిత్తేన స్వధర్మేణామలాత్మనా|*

*తీవ్రయా మయి భక్త్యా చ శ్రుతసంభృతయా చిరమ్॥*


*తాత్పర్యము : శ్రీ కపిలభగవానుడు నుడివెను - *తల్లీ! అగ్నికి ఉత్పత్పి స్థానమైన అరణి,తన నుండి ఉత్పన్నమైన అగ్నివలన కాలి బూడిదయగును. అట్లే నిష్కామభావముతో చేసిన స్వధర్మాచరణముద్వారా అంతఃకరణము పరిశుద్ధమై చాలాకాలము భగవత్కథాశ్రవణము ద్వారా దృఢపడిన భక్తివలనను,*


వ్యాఖ్య : *పరమాత్మను ఎలా ఆరాధించాలి? కేవలం భక్తితోనేనా? ఉపాంగములతో కూడిన భక్తి. అంటే కర్మ, జ్ఞ్యానమూ, భక్తి, ప్రపతీ, అవతార రహస్య జ్ఞ్యానం. ఇన్ని యోగములతో కూడిన భక్తితో ఆరాధించబడిన పరమాత్మ ప్రసన్నుడై, అనుగ్రహించి మనను, తాను ఆత్మగా ఉన్న జీవాత్మ స్వరూప జ్ఞ్యానాన్ని కలిగిస్తే, అది కలిగిన తరువాత, ఆయన అనుగ్రహముతో ఆయనను పొందుతాము. పరమాత్మ అనుగ్రహం కలిగిన తరువాత ప్రకృతి మనని విడిచిపెడుతుంది. ఈ భక్తి యోగానికి అంగాలుగా ఉన్న మిగతా యోగాలు కూడా అర్థంకావాలి.


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 137 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 21 🌴*


*21. śrī-bhagavān uvāca*

*animitta-nimittena sva-dharmeṇāmalātmanā*

*tīvrayā mayi bhaktyā ca śruta-sambhṛtayā ciram*


*MEANING : The Supreme Personality of Godhead said: One can get liberation by seriously discharging devotional service unto Me and thereby hearing for a long time about Me or from Me. By thus executing one's prescribed duties, there will be no reaction, and one will be freed from the contamination of matter.*


*PURPORT : Śrīdhara Svāmī comments in this connection that by association with material nature alone one does not become conditioned. Conditional life begins only after one is infected by the modes of material nature. If someone is in contact with the police department, that does not mean that he is a criminal. As long as one does not commit criminal acts, even though there is a police department, he is not punished. Similarly, the liberated soul is not affected, although he is in the material nature. Even the Supreme Personality of Godhead is supposed to be in association with material nature when He descends, but He is not affected. One has to act in such a way that in spite of being in the material nature he is not affected by contamination. Although the lotus flower is in association with water, it does not mix with the water. That is how one has to live, as described here by the Personality of Godhead Kapiladeva (animitta-nimittena sva-dharm eṇāmalātmanā). One can be liberated from all adverse circumstances simply by seriously engaging in devotional service.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 728 / Vishnu Sahasranama Contemplation - 728 🌹*


*🌻728. కః, कः, Kaḥ🌻*


*ఓం కాయ నమః | ॐ काय नमः | OM Kāya namaḥ*


*సుఖస్వరూపిణం విష్ణుం కశబ్దః సుఖవాచకః ।*

*విబోధయతి తస్మాత్ సక ఇతి ప్రోచ్యతేబుధైః ।*

*కం బ్రహ్మేతి శ్రుతేర్విష్ణుః పరమాత్మ సనాతనః ॥*


*'క' అను శబ్దమునకు సుఖము అని అర్థము. పరమాత్ముడు సుఖస్వరూపుడు కావున అట్టి 'క' అను శబ్దముచే స్తుతించబడును కావున 'కః' అనబడును.*


*ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మేతి (ఛాందోగ్యోపనిషత్ 4.10.5) - 'ప్రాణము బ్రహ్మము, కం అనగా బ్రహ్మము, ఖం అనగా బ్రహ్మము (క, ఖ - ఈ రెండు అక్షరములు ఒకటే. క = సుఖము, ఆనందము. ఖ = ఆకాశము, హృదయాకాశము. ప్రాణము, ప్రాణమునకు ఆశ్రయమగు ఆకాశము)*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 728🌹*


*🌻728. Kaḥ🌻*


*OM Kāya namaḥ*


सुखस्वरूपिणं विष्णुं कशब्दः सुखवाचकः ।

विबोधयति तस्मात् सक इति प्रोच्यतेबुधैः ।

कं ब्रह्मेति श्रुतेर्विष्णुः परमात्म सनातनः ॥


*Sukhasvarūpiṇaṃ viṣṇuṃ kaśabdaḥ sukhavācakaḥ,*

*Vibodhayati tasmāt saka iti procyatebudhaiḥ,*

*Kaṃ brahmeti śruterviṣṇuḥ paramātma sanātanaḥ.*


*The sound 'ka' stands for sukha or happiness. Since the paramātma is embodiment of happiness, He is aptly praised by Kaḥ.*


*प्राणो ब्रह्म कं ब्रह्म खं ब्रह्मेति / Prāṇo brahma kaṃ brahma khaṃ brahmeti (Chāndogyopaniṣat 4.10.5) -*


*The Prāṇa i.e., life force is Brahman, ka (joy) is Brahman, kha (the ākāśa) is Brahman.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥

ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥

Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 689 / Sri Siva Maha Purana - 689 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 02 🌴*

*🌻. శివ స్తుతి - 2 🌻*


సనత్కుమారుడిట్లు పలికెను -


దుఃఖితులై యున్న ఆ ఇంద్రాది దేవతలందరు బ్రహ్మగారి మాటలను విని వృషభధ్వజుడగు శివుడు నివసించి యున్న స్థానమునకు వెళ్లిరి (11). అపుడు వారందరు లోకములకు మంగళములను గూర్చువాడు, దేవదేవుడు అగు శంకరునకు తలలు వంచి చేతులు జోడించి భక్తితో ప్రణమిల్లి ఇట్లు స్తుతించిరి (12).


దేవతలిట్లు పలికిరి -


నీవు హిరణ్య గర్భుడవై సృష్టినంతనూ చేసితివి. సర్వసమర్దుడగు విష్ణువు యొక్క రూపమును దాల్చి జగత్తును రక్షించుచున్నావు. నీకు నమస్కారము (13). నీవు రుద్ర స్వరూపుడవై ప్రాణులను సంహరించెదవు. కాని నీవు నిర్గుణుడు, సాటిలేని తేజస్సు గలవాడు అగు శివుడవు. నీకు నమస్కారము (14). అవస్థలకు అతీతుడు, వికారరహితుడు, తేజస్స్వరూపుడు, పంచ మహాభూతముల స్వరూపములో నున్నవాడు, కర్మలేపము లేనివాడు, అఖండాత్మ స్వరూపుడు (15), భూతములకు ప్రభువు, బ్రహ్మాండ భారమును మోయువాడు, తృష్టను పోగొట్టువాడు, దోషరహితమగు ఆకారము గలవాడు, మహాతేజశ్శాలి అగు శివునకు నమస్కారము (16).


మహారాక్షసులనే మహారణ్యమును తగులబెట్టే దావాగ్ని వంటివాడు, దైత్యులనే వృక్షములకు గొడ్డలియైనవాడు, చేతియందు శూలమును ధరించువాడు అగు నీకు నమస్కారము (17). ఓ పరమేశ్వరా! గొప్ప రాక్షసులను సంహరించే నీకు నమస్కారము. అస్త్రములనన్నిటినీ ధరించువాడా! పార్వతీ పతివగు నీకు నమస్కారము (18). ఓ పార్వతీ పతీ! పరమాత్మా! మహేశ్వరా! నల్లని కంఠము గల్గిన, రుద్రరూపుడవగు నీకు నమస్కారము(19). నీవు ఉపనిషద్వాక్యములచే తెలియబడుదువు. కర్మ, భక్తి ఇత్యాది మార్గములకు నీవు అతీతుడవు. త్రిగుణాత్మకుడవు నీవే. త్రిగుణ రహితుడవు నీవే. నీకు అనేక నమస్కారములు (20).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 689🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 02 🌴*


*🌻 The Prayer of the gods - 2 🌻*


Sanatkumāra said:—

11. On hearing the words of Brahmā, the distressed gods including Indra went to the place where the bull-bannered god Śiva was staying.


12. Devoutly bowing to Śiva, the lord of the gods, with palms joined in reverence, all of them bent their shoulders and eulogised Śiva, the benefactor of the worlds.


The gods said:—

13. Obeisance to the gold-wombed lord, the creator of everything. Obeisance to Thee, the sustainer, the omnipresent and the omnipotent.


14. Obeisance to Thee of destroyer’s form, the annihilator of living beings. Obeisance to Thee devoid of attributes, and of immeasurable splendour.


15. Obeisance to Thee devoid of states, possessed of splendour and free from aberrations; obeisance to Thee of the soul of Great Elements; obeisance to the unsullied, the great Ātman.


16. Obeisance to Thee, the lord of all beings, the sustainer of great burden, the remover of thirst, to Thee whose form is devoid of enmity, to Thee of excessive splendour.


17. Obeisance to Thee, the destroyer of the great forest in the form of great Asuras, like conflagration. Obeisance to the Trident-bearing lord who acts as the axe for the trees of Asuras.


18. O great lord, obeisance to Thee, the destroyer of great Asuras; obeisance to Thee the lord of Pārvatī, O wielder of all weapons.


19. O lord of Pārvatī, Obeisance to Thee, O great soul, O great lord. Obeisance to Thee, the blue-necked Rudra and of the form of Rudra.


20. Obeisance to Thee, knowable through Vedānta; Obeisance to Thee who art beyond the paths. Obeisance to Thee of the form of attributes, possessing attributes and also devoid of them.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 310 / Osho Daily Meditations - 310 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 310. సంధ్యా సమయం 🍀*


*🕉. సంధ్యా సమయాన్ని ఉపయోగించు కోవడం ద్వారా చాలా మంది ఉనికిలో ఎదిగారు. 🕉*


*భారతదేశంలో, సంధ్య అనే పదం ప్రార్థనకు పర్యాయపదంగా ఉంటుంది. ప్రార్థన చేస్తున్న ఒక సనాతన హిందువు దగ్గరకు వెళితే, 'నేను సంధ్య చేస్తున్నాను--నేను నా ప్రార్థనను సంధ్యా సమయంలో చేస్తున్నాను' అని అంటాడు. సూర్యోదయానికి ప్రకృతిలో గొప్ప మార్పు కనిపిస్తుంది. మొత్తం నిష్క్రియ ఉనికి చురుకుగా మారుతుంది. నిద్ర విచ్ఛిన్నమవుతుంది; కలలు కనుమరుగవుతాయి. అంతటా జీవితం మళ్లీ పుడుతుంది. ఇది పునరుత్థానం. ఇది ప్రతిరోజూ జరిగే ఒక అద్భుతం.*


*ఆ క్షణంలో దానితో తేలియాడేలా మిమ్మల్ని మీరు అనుమతించుకుంటే, మీరు చాలా ఉన్నత శిఖరానికి ఎదగవచ్చు. సూర్యుడు అస్తమించినప్పుడు కూడా అదే మార్పు మళ్లీ జరుగుతుంది. అంతా నిశ్శబ్దం, ప్రశాంతత. ఒక ప్రశాంతతని, గాఢమైన నిశ్శబ్దాన్ని ఉనికిలో వ్యాపింప జేస్తుంది. ఆ క్షణంలో, మీరు చాలా లోతులకు చేరుకోవచ్చు. ఉదయం మీరు చాలా గొప్ప ఎత్తులకు చేరుకోవచ్చు; సాయంత్రం మీరు చాలా లోతైన లోతులకు చేరుకోవచ్చు మరియు రెండూ అందంగా ఉంటాయి. పైకి లేదా చాలా లోతుకు వెళ్లండి. రెండు విధాలుగా మిమ్మల్ని మీరు అధిగమించ గలరు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 310 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 310. TWILIGHT 🍀*


*🕉. Many people have entered into existence through twilight. 🕉*


*In India, the word sandhya--twilight-has become synonymous with prayer. If you approach an orthodox Hindu who is praying, he will say, "I was doing sandhya--I was doing my twilight." When the sun rises, just before sunrise, there is a great change. The whole passive existence becomes active. Sleep is broken; dreams disappear. The trees and birds and life everywhere arise again. It is a resurrection. It is a miracle every day.*


*If you allow yourself to float with it in that moment, you can rise to a very high peak. And the same change happens again when the sun sets. Everything quiets, calms. A tranquility, a deep silence, pervades existence. In that moment, you can reach to the very depths. In the morning you can reach to very great heights; in the evening you can reach to very deep depths, and both are beautiful. Either go high or very deep. In both ways you transcend yourself.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।*

*కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀*


*🌻 434. 'కుశలా' - 2🌻*


*మానవ నిర్మాణము శ్రీమాత అత్యంత కౌశలముగ చేసినది. ప్రతి మానవుడు తనంత వాడుగ అగుటకు వలసిన ఏర్పాట్లన్నియూ మానవ నిర్మాణమున చేసినది. ఇంతకన్న కౌశల మెక్కడ యుండును? శివునితో కూడి చేసిన కూర్పు గనుక సృష్టి యందు కుశలత్వ మున్నది. మానవుడు కూడ శివశక్తులకు అధీనుడై పురోగమించినచో కుశలముగ నుండును. కేవలము యోగస్థితియే కుశలము నిచ్చునుగాని, ఇతర స్థితుల వలన కుశలము పొందుట సులభము కాదు. సమదృష్టి గలవారికే కుశలము సహజముగ నుండును. అట్టివారి కార్యములు కూడ కౌశలముతో కూడియుండును. సమదృష్టి ప్రసాదింప బడుటకు శివ శక్తుల ఆరాధన తప్పనిసరి. ఇందు ఎవరిని విస్మరించిననూ యోగస్థితి కలుగదు.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 434 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 93. Kushala komalakara kurukulla kuleshvari*

*Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻*


*🌻 434. 'Kushala' -2🌻*


*The human structure is the most skillful creation of Srimata. Every human being has been made all the necessary arrangements for his evolution in the human structure. How skilful! Creation has bliss on it as it is made along with Lord Shiva. If a human being is subservient to the powers of Shiva and Shakthi and progressed, then there is bliss. It is not easy to get bliss due to other states as only yoga is the source of bliss. Bliss is natural for those who have equanimity. Their actions are also skillful. Worship of Shiva and Shakti is mandatory to be granted equanimity. Anyone who ignores this does not attain yoga.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

Comments


bottom of page