top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 22, OCTOBER 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

Updated: Oct 22, 2023

🍀🌹 22, OCTOBER 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 22, OCTOBER 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 8. మహాగౌరి మాత - మహిషాసురమర్ధిని దేవి / Worship Maa Mahagauri - Mahisasura Mardhini Devi on the 8th day of Navaratri 🌹

🍀. దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరికి, Durga Ashtami Good Wishes to All. 🍀

2) 🌹 కపిల గీత - 253 / Kapila Gita - 253 🌹

🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 18 / 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 18 🌴

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 845 / Vishnu Sahasranama Contemplation - 845 🌹

🌻845. ప్రాగ్వంశః, प्राग्वंशः, Prāgvaṃśaḥ🌻

4) 🌹. శివ సూత్రములు - 160 / Siva Sutras - 160 🌹

🌻 3-8. జాగ్రద్ ద్వితీయకారః   - 1 / 3-8. jāgrad dvitīyakarah   - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 22, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹*

*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*

*🍀. దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరికి, Durga Ashtami Good Wishes to All. 🍀*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : దుర్గాష్టమి, Durga Ashtami, 🌻*


*🌷. శ్రీ దుర్గా దేవి స్తోత్రము 🌷*

*రక్ష రక్ష మహాదేవి దుర్గే దుర్గతినాశిని | మాం భక్తమనురక్తం చ శత్రుగ్రస్తం కృపామయి*

*విష్ణుమాయే మహాభాగే నారాయణి సనాతని | బ్రహ్మస్వరూపే పరమే నిత్యానందస్వరూపిణీ*


*ఓం హ్రీం దుం దుర్గాయై నమః*

*విరాటనగరం రమ్యం – గచ్చమానో యుద్ధిష్టిరః*

*అస్తువ న్మనసా దేవీం – దుర్గాం త్రిభువనేశ్వరీమ్.*

*త్వం బ్రహ్మవిద్యావిద్యానాం మహానిద్రా చ దేహినామ్*

*స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని*


*🌷. అలంకారము - నైవేద్యం : దుర్గాదేవి - ముదురు ఎరుపు రంగు - కదంబం (కిచిడి), శాకాన్నం.*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : నిశ్చల నీరవతా స్థితి - మనస్సు ఏ ఆలోచనలూ లేక నిశ్చల నీరువత గడించు కొన్నప్పుడే తరచుగా ఊర్ధ్వము నుండి విశాలశాంతి సంపూర్ణంగా అవతరించడం, మనస్సున కతీతమై సర్వత్రా విస్తరించుకొని వున్న ఆత్మతత్వ అనుభూతి కలుగడం జరుగుతూ వుంటుంది. కాని, అట్టి నీరవతా స్థితిలో అన్నమయ, ప్రాణమయ చిత్తవృత్తులు ఆ అవకాశం లోనికి చొరబడకుండా మాత్రం సాధకుడు జాగ్రత్త తీసుకోడం అవసరం. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శరద్ ఋతువు, దక్షిణాయణం,

ఆశ్వీయుజ మాసం

తిథి: శుక్ల-అష్టమి 20:00:33 వరకు

తదుపరి శుక్ల-నవమి

నక్షత్రం: ఉత్తరాషాఢ 18:45:13

వరకు తదుపరి శ్రవణ

యోగం: ధృతి 21:53:55 వరకు

తదుపరి శూల

కరణం: విష్టి 08:58:04 వరకు

వర్జ్యం: 03:31:40 - 05:03:00

మరియు 22:30:00 - 24:00:00

దుర్ముహూర్తం: 16:16:52 - 17:03:29

రాహు కాలం: 16:22:42 - 17:50:06

గుళిక కాలం: 14:55:17 - 16:22:42

యమ గండం: 12:00:28 - 13:27:53

అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23

అమృత కాలం: 12:39:40 - 14:11:00

సూర్యోదయం: 06:10:51

సూర్యాస్తమయం: 17:50:06

చంద్రోదయం: 13:05:54

చంద్రాస్తమయం: 00:26:03

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: మకరం

యోగాలు: అమృత యోగం - కార్య

సిధ్ది 13:03:59 వరకు తదుపరి

ముసల యోగం - దుఃఖం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 8. మహాగౌరి మాత - మహిషాసురమర్ధిని దేవి / Worship Maa Mahagauri - Mahisasura Mardhini Devi on the 8th day of Navaratri 🌹*

*🍀 . ప్రసాద్ భరద్వాజ*


*🌻. 8. మహాగౌరి ప్రార్ధనా శ్లోకము 🌻*

*శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।*

*మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా ॥*


*🌷. 8. మహిషాసురమర్ధిని స్తోత్రము 🌷*

*అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే*

*గిరివరవింధ్య శిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే |*

*భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే*

*జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||*


*🌷. అలంకారము - నైవేద్యం : మహాగౌరి - మహిషాసురమర్ధిని దేవి - ముదురు ఎరుపు రంగు. - బెల్లం పొంగలి*


*🌴. మహిమ - చరిత్ర 🌴*

*దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపానికి ‘మహాగౌరి’ అని పేరు. ఈమె పూర్తిగా గౌరవర్ణశోభిత. ఈమె గౌరవర్ణశోభలు మల్లెపూలూ, శంఖం, చంద్రులను తలపింపజేస్తాయి. ఈమె అష్టవర్షప్రాయముగలది (అష్టవర్షభవేద్గౌరీ). ఈమె ధరించే వస్త్రాలూ, ఆభరణాలూ ధవళ కాంతులను వెదజల్లుతుంటాయి. చతుర్భుజ, సింహవాహన. ఒక కుడిచేత అభయముద్రనూ, మరొక కుడి చేతిలో త్రిశూలాన్నీ వహించి ఉంటుంది. ఒక ఏడమచేతిలో డమరుకమూ, మరొక ఎడమ చేతిలో వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈ ముద్రలలో ఈమె దర్శనం ప్రశాంతంగా ఉంటుంది.*


*పార్వతి అవతారంలో ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి కఠోరమైన తపస్సును ఆచరించింది. వ్రియేఽహం వరదం శంభుం నాన్యం దేవం మహేశ్వరాత్ (నారద పాంచరాత్రము) అనేది ఈమె ప్రతిజ్ఞ. భగవంతుడైన శివుణ్ణి పరిణయమాడటానికే దృఢంగా సంకల్పించుకొన్నట్లు తులసీదాస మహాకవి పేర్కొన్నాడు.*


*జన్మకోటిలగి రగర హమారీ । బర ఉఁసంభు న తరహ ఉఁకుఁమారీ ॥*


*🌻. సాధన 🌻*

*కఠోర తపస్సు కారణాన ఈమె శరీరం పూర్తిగా నలుపెక్కి పోతుంది. ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై, ఈమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన గావిస్తారు. తత్ప్రభావంవల్ల ఈమె శ్వేతవర్ణశోభిత అయి విద్యుత్‌ కాంతులను విరజిమ్ముతుంటుంది. అప్పటినుండి ఈమె ‘మహాగౌరి’ అని వాసి గాంచింది.*


*ఇంకో కధ ప్రకారం, పుట్టుకతోనే నల్లని రంగు గల పరమేశ్వరిని ... పతి అయిన పరమేశ్వరుడు ఒకసారి పరిహాసముగా " కాళీ " అని పిలుస్తాడు. దాంతో ఆమె శివునితో పంతగించి , బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేసి ... ఆ నల్లని దేహాన్ని వదిలి శివునికి దీటుగా తెల్లని ఛాయతో 'మహా గౌరి 'గా అవతరించినది.*


*అష్టమ శక్తియైన మహాగౌరి పూజ కరణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవీ బహగవతంలో వర్ణించబడినవి. ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది. సర్వవిధ శుభంకరి - మహాగౌరి.*


*దుర్గా నవరాత్రోత్సవాల్లో ఎనిమిదవ రోజున మహాగౌరి ఉపాసన విధ్యుక్తంగా నిర్వహించబడుతుంది. ఈమె శక్తి అమోఘమూ, సధ్యఃఫలదాయకము.*


*ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషాలన్నీ ప్రక్షాళన చెందుతాయి. వారి పూర్వసంచిత పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. భవిష్యత్తులో కూడా పాపతాపాలుగానీ, దైన్యదుఃఖాలు కానీ వారి దరిజేరవు. వారు సర్వ విధాలా పునీతులై, అక్షయంగా పుణ్య ఫలాలను పొందుతారు.*


*మహాగౌరీ మాతను ధ్యానించటం, స్మరించటం, పూజించటం, ఆరాధించటం, మున్నగు రీతుల్లో సేవించటం వల్ల భక్తులకు సర్వ విధాలైనట్టి శుభాలు చేకూరుతాయి. మనము ఎల్లప్పుడు ఈమెను ధ్యానిస్తూ ఉండాలి. దేవి కృపవల్ల ఎల్లరికీ అలౌకిక సిద్ధులు ప్రాప్తిస్తాయి. మనస్సును ఏకాగ్రచిత్తం చేసి, అనన్య నిష్ఠతో సాధకులు ఈ దేవి పాదారవిందాలను సేవించటంవల్ల వారి కష్ఠాలు మటుమాయమవుతాయి.*


*ఈమె ఉపాసన ప్రభావం వల్ల అసంభవాలైన కార్యాలు సైతం సంభవాలవుతాయి. కనుక సర్వదా సర్వదా ఈమె పాదాలను శరణుజొచ్చటమే కర్తవ్యము. పురాణాలలో ఈమె మహిమలు శతథా ప్రస్తుతించబడ్డాయి. ఈమె సాధకుల మనో వ్యాపారాలను అపమార్గాల నుండి సన్మార్గానికి మరలిస్తుంది. మనం అనన్య భక్తి ప్రపత్తులతో ఈమెకు శరణాగతులమవటం ఎంతో శుభదాయకం.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. Worship Maa Mahagauri - Mahisasura Mardhini Devi on the 8th day of Navaratri 🌹*


*The 8th day of Navaratri is dedicated to Maa Mahagauri, the 8th Avtar of Maa Durga. The legend has it that Maa Mahagauri liberated the world from evil forces. She has three eyes and four hands. Her lower right hand holds a trishul and the upper right hand is in the mudra of allaying fear. Whereas her lower left hand is in a pose of granting boons to Her devotees and she is holding a damaru in Her upper left hand.*


*She has extremely fair complexion and therefore Maa is compared with the conch, the moon and the white flower of Kunda. Radiant and compassionate, Maa Maugauri is usually depicted in a white or green saari and riding a bull. She is also known as Shwetambardhara. Maa Mahagauri purifies the souls of Her devotees and removes all their sins. She has a calming effect on the lives of Her devotees and she also helps them improve their knowledge. *


*Worship Maa Mahagauri to be free from the clutches of the material world and to remove sorrows from your life, for She will lead you to the path of virtue and inner power.*


*🍀. Spiritual Significance 🍀*


*Mahagauri is the kriya Shakti of existence . Kriya means action , the energy which creates motion in static matter is Mahagauri . She is the eighth manifestation of Goddess Durga who is worshiped on Maha Durgashtami . She is the beloved wife of Lord Shiva , who is meditated upon seated on Nandi , the bull . She has four hands in which she holds a trident , damru , abhaya and Vara mudras. She is saumyamukhi or has blissful expression on face .*


*Mahagauri also represents the union of Shiva with Shakti . She completes him by merging him with herself , which makes him Ashutosh . Shiva grants auspicious boons to his devotees only when he is United with Shakti , without her he becomes dispassionate and has no purpose in existence . The reason Mahagauri plays a Damru represents that divine union of Shiva and Shakti . Their union is considered auspicious for continuance of existence , so Mahagauri embodies the greatest Auspiciousness.*


*She is the creator of life , the Yoni from whom the creation takes birth . She is mother to all life forms . Her worship grants experience of oneness with all lives . When one feels the same amount of love and compassion for everyone , the oneness can be felt . This oneness is auspiciousness of Mahagauri , as it reduces friction and stress in our surrounding and creates acceptance and Harmony , for smooth functioning of life . The purpose of spirituality is to reduce external friction to go deed inside your spiritual self . Mahagauri provides this kind of transformation with her worship .*


*🌻. Mantra and other Facts 🌻*


*Recite the below-mentioned Mantras to get the blessing from the almighty Maa Mahagauri.*


*ॐ देवी महागौर्यै नमः॥*

*Om Devi Mahagauryai Namah॥*


*या देवी सर्वभू‍तेषु माँ महागौरी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥*

*Ya Devi Sarvabhuteshu Maa Mahagauri Rupena Samsthita।*

*Namastasyai Namastasyai Namastasyai Namo Namah॥*


*The devotees should perform the eighth day of Navratri puja with huge devotion and pure mind so that Devi Mahagauri fulfils all their desires. You can also attain abundance and bring happiness to your life by worshipping a Meru Prushth Shree Yantra. Maa Mahagauri vanishes all the previous sins and wrong deeds of the devotees and purifies their life. Goddess Mahagauri leads them to the path of truth and happiness.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🍀. దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరికి, Durga Ashtami Good Wishes to All. 🍀*

🌻. ప్రసాద్ భరద్వాజ*


*🌷. శ్రీ దుర్గా దేవి స్తోత్రము 🌷*

*రక్ష రక్ష మహాదేవి దుర్గే దుర్గతినాశిని | మాం భక్తమనురక్తం చ శత్రుగ్రస్తం కృపామయి*

*విష్ణుమాయే మహాభాగే నారాయణి సనాతని | బ్రహ్మస్వరూపే పరమే నిత్యానందస్వరూపిణీ*


*ఓం హ్రీం దుం దుర్గాయై నమః*

*విరాటనగరం రమ్యం – గచ్చమానో యుద్ధిష్టిరః*

*అస్తువ న్మనసా దేవీం – దుర్గాం త్రిభువనేశ్వరీమ్.*

*త్వం బ్రహ్మవిద్యావిద్యానాం మహానిద్రా చ దేహినామ్*

*స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని*


*🍀. దుర్గాష్టమి విశిష్టత 🍀*


*ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. ఎనిమిదవ రోజు.. అంటే ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం. ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడిన వారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు.*

*పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు విజయదశమి నాడు భక్తిగా పూజలు చేస్తారు.*

*మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు.*

*తమ పిల్లలను తల్లిదండ్రులు ఇతర రోజుల కంటే దుర్గాష్టమి లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడం ఉత్తమంగా భావిస్తారు. ఈ రోజుల్లో గనుక చిన్నారుల చేత ''ఓంకారం'' రాయించి విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు.*

*వ్యాపారులు తమ షాపులు లేదా సంస్థలను పూవులతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు. అందుచేత దుర్గాష్టమి రోజున శక్తిపీఠాలను దర్శించుకోవడం లేదా సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించడం చేయాలని పండితులు చెబుతారు.*

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. కపిల గీత - 253 / Kapila Gita - 253 🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 18 🌴*


*18. ఏవం కుటుంబభరణే వ్యాపృతాత్మాఽ జితేంద్రియః|*

*మ్రియతే రుదతాం స్వానామురువేదనయాస్తధీః॥*


*తాత్పర్యము : ఈ విధముగా మూఢుడు ఇంద్రియ నిగ్రహము లేని వాడై దూరదృష్టి లేక నిరంతరము కుటుంబ పోషణ యందే తలమున్కలై యుండును. చివరిదశలో చుట్టును జేరి ఏడ్చుచున్న తనవారి మధ్య అచేతునుడై పడి యుండి వేదనపడుచు మరణించును.*


*వ్యాఖ్య : భగవద్గీతలో మరణ సమయంలో అతను తన జీవితకాలంలో పండించిన ఆలోచనలలో మునిగిపోతాడని చెప్పబడింది. తన కుటుంబ సభ్యులను సరిగ్గా నిర్వహించడం తప్ప వేరే ఆలోచన లేని వ్యక్తి తన చివరి ఆలోచనలలో కుటుంబ వ్యవహారాలను కలిగి ఉంటాడు. అది సామాన్యుడికి సహజమైన క్రమం. సామాన్యుడికి తన జీవిత గమ్యం తెలియదు; క్షణికమైన జీవితంలో అతను తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వ్యస్తుడై ఉన్నాడు. చివరి దశలో, అతను కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరిచాడనే దానితో ఎవరూ సంతృప్తి చెందరు; అతను తగినంతగా అందించలేదని అందరూ అనుకుంటారు. అతని లోతైన కుటుంబ ఆప్యాయత కారణంగా, అతను ఇంద్రియాలను నియంత్రించడం మరియు తన ఆధ్యాత్మిక స్పృహను మెరుగుపరచడం అనే తన ప్రధాన కర్తవ్యాన్ని మరచిపోతాడు. కొన్నిసార్లు చనిపోతున్న వ్యక్తి కుటుంబ వ్యవహారాలను తన కొడుకు లేదా బంధువుకి అప్పగిస్తాడు, 'నేను వెళ్తున్నాను. దయచేసి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి.' అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ మరణ సమయంలో కూడా అతను తన కుటుంబాన్ని ఎలా పోషిస్తాడో అని ఆత్రుతగా ఉంటాడు. కొన్నిసార్లు మరణిస్తున్న వ్యక్తి తాను ప్రారంభించిన కుటుంబ నిర్వహణ ప్రణాళికను పూర్తి చేయడానికి కనీసం కొన్ని సంవత్సరాల పాటు తన జీవితాన్ని పెంచుకోవాలని వైద్యుని అభ్యర్థించడం కనిపిస్తుంది. ఇవి షరతులతో కూడిన ఆత్మ యొక్క భౌతిక వ్యాధులు. అతను దైవీ స్పృహను పొందడం అనే తన నిజమైన నిశ్చియాన్ని పూర్తిగా మరచిపోతాడు. అతను కుటుంబాన్ని ఒకదాని తర్వాత ఒకటిగా మార్చుకున్నప్పటికీ, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ గంభీరంగా ఉంటాడు.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 253 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 18 🌴*


*18. evaṁ kuṭumba-bharaṇe vyāpṛtātmā jitendriyaḥ*

*mriyate rudatāṁ svānām uru-vedanayāsta-dhīḥ*


*MEANING : Thus the man, who engaged with uncontrolled senses in maintaining a family, dies in great grief, seeing his relatives crying. He dies most pathetically, in great pain and without consciousness.*


*PURPORT : In Bhagavad-gītā it is said that at the time of death one will be absorbed in the thoughts which he cultivated during his lifetime. A person who had no other idea than to properly maintain his family members must have family affairs in his last thoughts. That is the natural sequence for a common man. The common man does not know the destiny of his life; he is simply busy in his flash of life, maintaining his family. At the last stage, no one is satisfied with how he has improved the family economic condition; everyone thinks that he could not provide sufficiently. Because of his deep family affection, he forgets his main duty of controlling the senses and improving his spiritual consciousness. Sometimes a dying man entrusts the family affairs to either his son or some relative, saying, "I am going. Please look after the family." He does not know where he is going, but even at the time of death he is anxious about how his family will be maintained. Sometimes it is seen that a dying man requests the physician to increase his life at least for a few years so that the family maintenance plan which he has begun can be completed. These are the material diseases of the conditioned soul. He completely forgets his real engagement—to become Kṛṣṇa conscious—and is always serious about planning to maintain his family, although he changes families one after another.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 845 / Vishnu Sahasranama Contemplation - 845🌹*


*🌻845. ప్రాగ్వంశః, प्राग्वंशः, Prāgvaṃśaḥ🌻*


*ఓం ప్రాగ్వంశాయ నమః | ॐ प्राग्वंशाय नमः | OM Prāgvaṃśāya namaḥ*


అన్యస్య వంశినో వంశాః పాశ్చాత్యా అస్య శార్ఙ్గిణః ।

వంశః ప్రపఞ్చః ప్రాగేవ న పాశ్చాత్య ఇతీశ్వరః ॥

ప్రాగ్వంశ ఇత్యుచ్యతే హి వేదవిద్యావిశారదైః ॥


*తమ పేరున వంశము కలవారగు 'వంశుల'కు వంశములు తమ కంటె పాశ్చాత్త్యములు అనగా తమ తరువాత ఏర్పడునవి. కాని ప్రపంచము అనబడు పరమాత్ముని సంతానపు వంశము మాత్రము ముందుగానే, అనాదిగా, అది-ఇది అని నిర్ణయించ శక్యముకాక ఉన్నది. కావున పరమాత్ముడు ప్రాగ్వంశః - ముందునుండియు తన వంశము కలవాడు అని పరమాత్ముడు చెప్పబడును.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 845🌹*


*🌻845. Prāgvaṃśaḥ🌻*


*OM Prāgvaṃśāya namaḥ*


अन्यस्य वंशिनो वंशाः पाश्चात्या अस्य शार्ङ्गिणः ।

वंशः प्रपञ्चः प्रागेव न पाश्चात्य इतीश्वरः ॥

प्राग्वंश इत्युच्यते हि वेदविद्याविशारदैः ॥


Anyasya vaṃśino vaṃśāḥ pāścātyā asya śārṅgiṇaḥ,

Vaṃśaḥ prapañcaḥ prāgeva na pāścātya itīśvaraḥ.

Prāgvaṃśa ityucyate hi vedavidyāviśāradaiḥ.


*Those by whose name races got into existence, have been there before the race itself. The race comes later. But the race of paramātma, namely the universe has been in existence before all that and not later; hence He is Prāgvaṃśaḥ.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।

अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।

అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr‌hatkr‌śaḥ sthūlo guṇabhr‌nnirguṇo mahān,

Adhr‌taḥ svadhr‌tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥


Continues....

🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 160 / Siva Sutras - 160 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*3వ భాగం - ఆణవోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 3-8. జాగ్రద్ ద్వితీయకారః   - 1 🌻*


*🌴. ఒక యోగి స్వయం యొక్క స్వచ్ఛమైన జ్ఞానంలో దృఢంగా స్థిరపడినప్పుడు, అతనికి ఈ బాహ్య ప్రపంచం తనలో ఒక కిరణం లేదా పొడిగింపు లేదా ఊహాదృశ్యంలా ద్వితీయంగా అవుతుంది. 🌴*


*జాగ్రత్ - జాగృత స్థితి, లేదా సాధారణ క్రియాశీల స్థితి; ద్వితీయ – రెండవ; కారః - కాంతి కిరణం.*


*శుద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించడం ద్వారా సాధకుడు గణనీయమైన ఆధ్యాత్మిక పురోగతిని సాధించ గలిగినప్పుడు మరియు కావలసిన స్థాయి స్పృహను సాధించినప్పుడు, బాహ్య విశ్వం అతనికి మరొక కాంతి ప్రకాశంగా కనిపిస్తుంది. 'నేను' మరియు 'ఇది' లేదా 'అహం' మరియు 'ఇదం' అనే భావన ఈ సూత్రంలో చర్చించబడింది. శుద్దీకరణ ప్రక్రియ పూర్తయినప్పుడు, ఆ దశను ఉన్మనా అంటారు, దీనిని సహజ విద్య అని కూడా అంటారు. ఉన్మనా అనేది ఎటువంటి ఆలోచనా ప్రక్రియలు లేకుండా మనస్సు నిశ్చలంగా ఉండే దశ. 'జ్ఞానోదయం యొక్క జాడలు కూడా తుడిచి పెట్టుకుపోయే' దశ ఇది. నేను లేదా అహం అంటే వ్యక్తిగత స్వయం మరియు ఇది లేదా ఇదం అంటే విశ్వంలో ఉన్న వస్తువులు. మరో మాటలో చెప్పాలంటే, అహం అనేది చూసేవాడు మరియు ఇదం అనేది బాహ్యంగా కనిపించేది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras  - 160 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

*Part 3 - āṇavopāya*

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 3-8. jāgrad dvitīyakarah   - 1 🌻*


*🌴. When a yogi is firmly established in the pure knowledge of the self, the wakeful world becomes secondary to him, like a ray or an extension or projection within himself. 🌴*


*Jāgrat – the state of awakening, the normal active state; dvitīya – second; karaḥ - ray of light.*


*When the aspirant is able to make significant spiritual progress by initiating the process of purification and achieved the desired level of consciousness, the universe appears to him as another radiance of light. The concept of “I” and “This” or “aham” and “idam” is discussed in this sūtra. When the purification process is complete, that stage is called unmanā, which is also known as sahaja vidyā. Unmanā is the stage where mind is stilled without any thought processes. This is the stage where “even the traces of enlightenment are wiped out”. I or aham means the individual self and this or idam means objects that prevail in the universe. In other words, aham is the seer and idam is seen.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page