🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 117 / DAILY WISDOM - 117 🌹
🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 26. ప్రపంచానికి సర్వశక్తిమంతుడి నాయకత్వం అవసరం 🌻
అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న, మరియు విశ్వ శక్తులను సమీకరించే సామర్థ్యం కలిగిన మేధావి యొక్క నాయకత్వం ఇప్పుడు అవసరం. ఈ విశ్వ శక్తులు అంటే ఆధ్యాత్మికం లేని భౌతికం లేదా భౌతికం లేని ఆధ్యాత్మికం కాకుండా రెండూ సమంగా ఉన్న కలయిక. సత్యం ఆత్మ మరియు పదార్థం యొక్క కలియిక. దైవం మరియు లోకం యొక్క కలయిక. మనిషి ఈ జ్ఞానాన్ని సంపాదిస్తే తప్ప తనకి ఇహపర లోకాల్లో శాంతిని పొందలేడు. ఈ జ్ఞానాన్ని పొందకపోతే అతనికి కావల్సింది ఎప్పటికీ దొరకదు.
ప్రపంచానికి ఒక సర్వశక్తిమంతుడి నాయకత్వం అవసరం. అతని దృష్టి దేవుణ్ణి మరియు ప్రపంచాన్ని ఒకే సమయంలో చూడగలగాలి, అతని వ్యక్తిత్వం దైవ మరియు మానవ విషయాల్లో రెండిటిలో పాల్గొనగనగాలి. మానవాళి సంక్షేమానికి తక్షణ అవసరం అని మనం చెప్పిన లక్షణాలు కలిగిన గొప్ప రాజనీతిజ్ఞుడు శ్రీ కృష్ణుడు. అతనిలో ఈ ప్రపంచం మనం పైన చెప్పిన మేధావిని చూసింది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 117 🌹
🍀 📖 The Ascent of the Spirit 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 26. The World Needs the Leadership of a Superman 🌻
The leadership of a tremendous genius and capacity for mustering in universal forces is called for. And these forces are neither material ones minus the spiritual, nor the spiritual minus the material. Truth is a fusion of both spirit and matter, of divinity and humanity, of God and the world. Will man be able to awaken this vision of himself? Then, there is hope for him, and then there can be peace, not only on Earth but also in heaven and everywhere. Else, the object sought for is far to seek, and difficult to find.
The world needs the leadership of a superman, whose eyes can see God and world at the same time, whose personality will be at once the sacred temple of the Almighty and the active thoroughfare of human business. The world did see the realisation of such an ideal in the personality of Sri Krishna, who was an outstanding specimen of the world’s greatest statesman in the sense we have defined above as an urgent need for the welfare of mankind.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments