🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 118 / DAILY WISDOM - 118 🌹
🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 27. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం / 27. A Relationship between Two Persons 🌻
సామాజికబంధం అనేది వ్యక్తిగతంగా అనుసంధానించబడిన వ్యక్తులతో సంబంధం లేకుండా పనిచేసే బాహ్య విషయంగా మాత్రమే ఉండి, వ్యక్తుల స్వభావానికి దగ్గరగా లేనంత కాలం సామాజికంగా ఉండే భద్రత మరియు స్నేహాలపై మీరు విశ్వాసం ఉంచలేరు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం వారి మూల పదార్ధంలోకి ప్రవేశించాలి; అప్పుడే వారి మధ్య సంబంధం స్నేహపూర్వకంగా, సురక్షితంగా మరియు శాశ్వతంగా మారుతుంది.
కానీ ఈ సంబంధం కేవలం సంబంధమున్న వ్యక్తులపై బయట ఒత్తిడితో ఏర్పడిన ఒక రూపం మాత్రమే తప్ప వారి మూల పదార్థంలో భాగం కాకపోతే, ఆ బాహ్య ఒత్తిడి వీగిపోగానే వారి మధ్య ఆ సయోధ్య పోతుంది. దేశాలు అమలు పరిచే చట్టాలలో జీవం లేకుండా కేవలం యాంత్రికంగా ఉంటే ఇలాగే ఉంటుంది. హోబ్స్ చెప్పిన సిద్ధాంతాలు మనం అర్థ చేసుకుంటే అతను కేవలం సంపూర్ణ రాజ్యాధికారం ఉంటే తప్ప దేశాన్ని పరిపాలించడం వీలు కాదని అన్నాడు. అంటే అతను దేశాన్ని కేవలం యాంత్రికంగా మాత్రమే పరిపాలించవచ్చని ప్రతిపాదించాడు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 118 🌹
🍀 📖 The Ascent of the Spirit 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 27. A Relationship between Two Persons 🌻
Social security and friendship cannot be assured as long as social relationship remains merely an external connection operating independent of the individuals so connected, and not intrinsic to the nature of the individuals themselves. A relationship between two persons hasto enter into the very substance of which the two persons are made; it is only then that the relationship between them becomes friendly, secure and permanent.
But if this relationship is only a form taken by a pressure exerted by something else upon the individuals appearing to be related, then the individuals so related by an extrinsic power foreign to their own nature can fly at the throats of each other the moment this extrinsic pressure is lifted. This is what happens if the State enforcing the laws of the society is a machinery rather than an organism. With Hobbes we may think the State cannot be anything more than a machine externally operating upon the individual, whatever be the necessity felt to operate this machine.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments